అత్యాచారం చేస్తే 21 రోజుల్లో మరణశిక్ష : ఏపీ క్రిమినల్ లా-2019కు కేబినెట్ ఆమోదం

  • Published By: veegamteam ,Published On : December 11, 2019 / 11:31 AM IST
అత్యాచారం చేస్తే 21 రోజుల్లో మరణశిక్ష : ఏపీ క్రిమినల్ లా-2019కు కేబినెట్ ఆమోదం

ఏపీ కేబినెట్ మహిళలకు అండగా ఉండేలా చారిత్రక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏపీ క్రిమినల్ లా చట్టం-2019కి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్ట్రన్స్ యాక్ట్ 2019కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మహిళలపై అత్యాచారానికి పాల్పడితే అతి త్వరగా నిందితులకు మరణశిక్ష పడేలా చట్టం తీసుకొచ్చింది. ఇటువంటి కేసుల్లో నిందితులను దోషులుగా నిర్థారించే ఆధారాలున్నప్పుడు మూడు వారాల్లోగా అంటే 21 వర్కింగ్ డేస్ ల్లో తీర్పు వచ్చేలా క్రిమినల్ లా చట్టంలో మార్పులు చేసేందుకు కేబినెట్ ఆమోదం పలికింది. ఇటువంటి కేసుల్లో వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలి..14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి..మొత్తం 21 రోజుల్లో కోర్టుల్లో తీర్పు వచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటారు.
  
ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రస్తుతం అత్యాచారాల కేసుల్లో నాలుగు నెలల్లోగా తీర్పు రావాలనే ఉంది. దీన్ని నాలుగు నెలల నుంచి 21 రోజులకు కుదిస్తూ చేసిన బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం పలికింది. మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలోను ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం జరిగింది.

అత్యాచారం, యాసిడ్ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు వంటి హింసాత్మక ఘటనల్లో నేరాల విచారణకు ప్రతి జిల్లాల్లోను ప్రత్యే కోర్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాదు సోషల్ మీడియా వేధికగా బాధిత మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలకు అడ్డుకట్టవేసేలా కేబినెట్ నిర్ణయించింది. మహిళలను కించపరిచేలా చేస్తున్న చర్యల్ని ఖండించింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగ్ లు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపనుంది.

ఇటువంటి చర్యలు మొదటిసారి చేస్తే.. రెండేళ్ల జైలు శిక్ష, రెండోసారి చేస్తే నాలుగేళ్ల జైలుశిక్ష పడేలా కఠిన నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పిల్లలపై లైంగిక వేధింపులు, నేరాలకు పాల్పడితే 354 (ఎఫ్) సెక్షన్ కింద ఐదేళ్ల నుంచి పదేళ్ల పాటు జైలుశిక్ష..పోక్సో చట్టం కింద ఇప్పటి వరకూ 3 నుంచి ఐదేళ్లు జైలు శిక్ష ఉన్న ఈ శిక్షను పెంచుతూ బిల్లులోని అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవన్నీ అమల్లోకి రానున్నాయి. దీంతో ఇక మహిళల్ని టచ్ చేయాలంటే భయపడాల్సిందే అనేలా జగన్ ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంది.

* మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం
* ఏపీ క్రిమినల్ లా చట్టం-2019కు కేబినెట్ ఆమోదం
* ఏపీ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ యాక్ట్ 2019కి కేబినెట్ ఆమోదం
* అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష
* నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు
* వారం రోజుల్లో దర్యాఫ్తు, 14 రోజుల్లో విచారణ పూర్తి, 21 వర్కింగ్ డే స్ లో తీర్పు
* ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు
* మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు
* అత్యాచారం, యాసిడ్ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు
* సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా, మహిళల గౌరవానికి భంగం కలిగించేలా పోస్టులు పెడితే చర్యలు
* మహిళలను కించపరిస్తే సెక్షన్ 354(ఇ) కింద చర్యలు
* మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష
* పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354(ఎఫ్) కింద చర్యలు
* ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలశిక్ష
* పోక్సో చట్టం కింద ఇప్పటివరకు 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలుశిక్ష
* శిక్షను పెంచుతూ బిల్లులోని అంశాలకు ఆమోదం