మరింత మందికి YSR Cheyutha

  • Published By: madhu ,Published On : July 16, 2020 / 07:14 AM IST
మరింత మందికి YSR Cheyutha

సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ..దూసుకపోతున్న సీఎం జగన్..మరిన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారు. కొన్ని పథకాల్లో మార్పులు చేస్తూ..మరింత మందికి లబ్ది చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్. పథకాల్లో YSR Cheyutha పథకం కూడా ఒకటి. దీనిని మరింత విస్తరింప చేయాలని తాజాగా నిర్ణయించారు.

YSR Pension కింద ప్రతి నెలా పెన్షన్‌ అందుకుంటున్న పలు వర్గాల మహిళలకు YSR Cheyutha కింద 4 సంవత్సరాల్లో రూ.75 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020, జులై 15వ తేదీన జరిగిన AP cabinet సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా దాదాపు 8.21 లక్షల మందికిపైగా మహిళలకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.

ఏడాదికి రూ. 1,540 కోట్లకు పైగా..నాలుగేళ్లలో రూ. 6 వేల 163 కోట్ల మేర ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయనుంది. పెన్షన్ కానుక అందుకుంటున్న ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, మత్స్యకార మహిళలు, దివ్యాంగులైన మహిళలు, చేనేతలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందనున్నారు.

BC, SC, ST, Minority వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలందరికీ ఈ పథకం వర్తింప చేయనుంది.
అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగేళ్లలో రూ. 75 వేలు అందివ్వనుంది. లబ్దిదారులకు జూన్ 28వ తేదీ నుంచే దరఖాస్తులు ఇచ్చారు.