ఇసుక వారోత్సవాలు, గ్రామ న్యాయాలయాలు : ఏపీ కేబినెట్ కీలక భేటీ

ఇసుక కొరత.. సంక్షేమ పథకాలపై చర్చించేందుకు బుధవారం(నవంబర్ 13,2019) ఏపీ కేబినెట్‌ సమావేశం కానుంది. సీఎం జగన్‌ నేతృత్వంలో జరిగే సమావేశంలో ఇసుక అక్రమ

  • Published By: veegamteam ,Published On : November 13, 2019 / 04:02 AM IST
ఇసుక వారోత్సవాలు, గ్రామ న్యాయాలయాలు : ఏపీ కేబినెట్ కీలక భేటీ

ఇసుక కొరత.. సంక్షేమ పథకాలపై చర్చించేందుకు బుధవారం(నవంబర్ 13,2019) ఏపీ కేబినెట్‌ సమావేశం కానుంది. సీఎం జగన్‌ నేతృత్వంలో జరిగే సమావేశంలో ఇసుక అక్రమ

ఇసుక కొరత.. సంక్షేమ పథకాలపై చర్చించేందుకు బుధవారం(నవంబర్ 13,2019) ఏపీ కేబినెట్‌ సమావేశం కానుంది. సీఎం జగన్‌ నేతృత్వంలో జరిగే సమావేశంలో ఇసుక అక్రమ రవాణాదారులకు జైలు శిక్ష విధించే అంశంపై చర్చించనున్నారు. ఇవే కాకుండా.. గ్రామ న్యాయాలయాల ఏర్పాటుతో పాటు పలు కీలక అంశాలను కేబినెట్‌లో చర్చించనున్నారు.

ఏపీలో ఇసుక మాఫియాకు చెక్‌ పెట్టేందుకు జగన్‌ సర్కార్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే నూతన ఇసుక విధానం ప్రకటించిన ప్రభుత్వం.. ఇక నేరుగా వినియోగదారుడికే ఇసుక అందేలా చర్యలు చేపట్టనుంది. మరోవైపు ఇసుక అక్రమ రవాణా జరగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఇందుకోసం సరిహద్దుల్లో 150 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం చేసే అంశం మంత్రివర్గ భేటీలో చర్చకు రానున్నట్లు సమాచారం. అంతే కాకుండా.. ఇసుక అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిర్దేశించిన ధర కన్నా ఎవరైనా ఎక్కువకు అమ్మితే.. రూ.2లక్షలు జరిమానాతోపాటు రెండేళ్ల జైలుశిక్ష అమలయ్యేలా కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

కేంద్రం తెచ్చిన గ్రామ న్యాయాలయాలను ఏపీలో ఏర్పాటు చేయడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 85 గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేసే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతి రెవెన్యూ డివిజ‌న్‌కి ఒక గ్రామ న్యాయాల‌యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయ‌నుంది సర్కార్‌. అంతేకాకుండా.. అవ‌స‌ర‌మైన మేర‌కు గ్రామ న్యాయాల‌యాల‌ను పెంచుకుంటూ పోవాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. 50 వేల విలువ గ‌ల ప్రతి కేసు గ్రామ న్యాయాల‌యాల కింద‌కు వ‌చ్చేలా చ‌ట్టంలో మార్పులు చేయ‌నున్నారు. మొబైల్ కోర్టుల త‌ర‌హాలో గ్రామ న్యాయాల‌యాలు న‌డ‌వ‌నున్నాయి. ఈ అంశంపై న్యాయశాఖ‌తోపాటు పోలీస్ శాఖతో చ‌ర్చించి మంత్రివ‌ర్గం నిర్ణయం తీసుకోనుంది. 

రాష్ట్రంలో నిరుపేద‌, ద‌ళిత రైతుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ భారీ ఊర‌ట క‌ల్పించ‌నుంది. ఇప్పటి వ‌ర‌కు అసైన్డ్ భూములను ఎలాంటి ప‌రిహారం ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వం అవ‌స‌రాల కోసం తీసుకునేది. కానీ.. ఇక‌పై అలా జ‌ర‌గ‌కుడ‌ద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ భావిస్తోంది. ప్రభుత్వ అవసరాలకు అసైన్డ్‌ భూములను తీసుకుంటే.. మార్కెట్ రేటు కంటే ప‌ది శాతం అద‌నంగా చెల్లించే ప్రతిపాద‌న మంత్రివ‌ర్గం ముందుకొచ్చింది. దీని వ‌ల‌న అసైన్డ్ భూములు ఉన్న పేద‌ల‌కు ఎంతో లాభం చేకూర‌నుంది. వీటితోపాటు అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల రెగ్యులరైజేషన్‌పై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు. 2019 ఆగస్టు 31 వరకు రిజిస్టరైన అక్రమ లేఅవుట్లను రెగ్యులరైజ్‌ చేయడంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా.. పొల్యూషన్‌ కంట్రోల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు ప్రతిపాదనలపై ఏపీ కేబినెట్‌ చర్చించనుంది.