బదిలీలపై కోర్టుకు ఏపీ సర్కార్ : మోడీ, షా భయంకర వ్యక్తులు – బాబు

  • Published By: madhu ,Published On : March 27, 2019 / 06:42 AM IST
బదిలీలపై కోర్టుకు ఏపీ సర్కార్ : మోడీ, షా భయంకర వ్యక్తులు – బాబు

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై ఏపీ సీఎం బాబు తీవ్రస్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ భయంకర వ్యక్తులుగా పేర్కొన్న బాబు..దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. ఏపీ రాష్ట్రంలో IPSల బదిలీలపై బాబు స్పందించారు. బదిలీలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అధికారులను బదిలీ చేసి ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని, వైసీపీ కంప్లయింట్ చేస్తే ఇలా చేస్తారా అంటు నిలదీశారు. సీఈసీ నిర్ణయంతో జాతీయస్థాయిలో పోరాటం చేస్తామన్నారు. ఏపీకి వస్తున్న మోడీ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
Read Also : 20రోజులు ఓపిక పడితే : మనందరి ప్రభుత్వం వస్తుంది

మార్చి 27వ తేదీ బుధవారం బాబు మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలను మేనేజ్ చేస్తారా ? ఎన్నికలు ఎందుకు ? నియంతగా మీరే డిక్లేర్డ్ చేసుకోండి..ఊడిగం చేస్తాం అన్నారు. లీగల్‌గా, పొలిటికల్‌గా పోరాటం చేస్తామన్నారు. సీఎం సెక్యూర్టీ బాధ్యత ఇంటెలిజెన్స్ చూస్తారని, ఎన్నికలకు సంబంధం లేని వ్యక్తిని బదిలీ చేయడం ఏంటీ అని ప్రశ్నించారు. 
ప్రజాస్వామ్య వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారంటూ ఆక్షేపణ చేశారు. ఏ పనిచేసినా సీఈసీ నిష్పక్షపాతికంగా వ్యవహరించాలని, భయబ్రాంతులకు గురి చేసి ఎన్నికలు పెట్టాలని అనుకోవడం సరికాదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తామిచ్చిన కంప్లయింట్‌పై ఎలాంటి రెస్పాండ్ ఇవ్వరని కానీ..వైసీపీ మాత్రం ఫిర్యాదు చేస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారని తెలిపారు. రెండు ఓట్లు చేరిపించారని..ఇంకా కొన్ని ఓట్లు తొలగించారని తాము ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. 85 శాతం ప్రజల ఓట్లు తీసేసి వైసీపీ పట్టుబడిందని, దీనిపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటయ్యారని, వీరి కుట్రలు బయటపడుతున్నాయన్నారు.

వీరిని అడ్డుపెట్టకుని కేంద్రం దుర్మార్గ కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. ఫామ్ 7పై 500 కేసులు నమోదైనా ఎందుకు చర్యలు తీసుకోలేదు ? ఎన్ని వేల కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి ? ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వీవీ ప్యాట్‌లను లెక్కించాలని అడిగినా ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినవసరం ఉందని బాబు చెప్పారు. 
Read Also : కాంగ్రెస్ లో అంతేగా : టికెట్ ఇవ్వలేదని.. పార్టీ ఆఫీస్ సామాను ఎత్తుకెళ్లిన ఎమ్మెల్యే