పునేఠపై వేటు : ఏం చేస్తారో చెయ్యండి..భయపడ – బాబు

  • Published By: madhu ,Published On : April 5, 2019 / 03:36 PM IST
పునేఠపై వేటు : ఏం చేస్తారో చెయ్యండి..భయపడ – బాబు

‘ఏం చేస్తారో చేసుకోండి..నేను భయపడ..40 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నాను..మోడీ నేరస్తులకు కాపలా కాస్తున్నారు..పార్టీలకు అతీతంగా ఎన్నికల కమిషన్ పనిచేయడం లేదు’ అంటూ ఏపీ సీఎం బాబు తీవ్రంగా స్పందించారు. ఏపీ ప్రధాన కార్యదర్శి పునేఠను ఈసీ బదిలీ వేటు వేసింది. ఈయన స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యంను అపాయింట్ చేసింది. విశాఖపట్టణం కంచరపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న బాబుకు ఈ విషయం తెలిసిందే. బదిలీలను ఖండించిన బాబు.. ఎన్నికల సంఘంపై ఫైర్ అయ్యారు. ఈసీ తీసుకున్న చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 

ఏం తప్పు చేశారని సీఎస్‌ను మార్చారని ప్రశ్నించారు బాబు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లు ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని పేర్కొన్నారు ఆయన. ఓట్లు తొలగించారు..చర్యలు తీసుకోవాలని కోరితే..ఎన్నికల కమిషన్ స్పందించదన్నారు. తెలంగాణలో 25 లక్షల మంది ఓట్లను తీసేశారని గుర్తు చేసిన బాబు..ఏపీలో 7 లక్షల ప్రజల ఓట్లను తొలగించారన్నారు. ఓట్లను తొలగింపుపై తాము సిట్ వేసి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు.. ఆధారాలు ఇవ్వాలంటే ఈసీ ఎన్నికల అధికారి మీన మేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. మోడీకి ఊడిగం చేయాలా ? వారి కాళ్లు పట్టుకోవాలా అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తీవ్రమైన నేరాలున్నాయన్నారు. విశాఖలో భూములుండవని..పోలీసులకు కంప్లయింట్ చేసినా పట్టించుకోరన్నారు. 

ఎన్నికళ వేళ అధికారుల బదిలీలు తీవ్ర ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఇటీవలే ఎన్నికల వేళ ఏపీలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలు రాహుల్‌దేవ్‌ శర్మ, వెంకటరత్నంలను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఏపీ సీఎస్‌గా ఉన్న పునేఠపై బదిలీ చేసింది. బదిలీల వెనుక వైసీపీ హస్తం ఉందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల విధులతో సంబంధం లేని వారిని ఏ కారణంతో బదిలీలు చేశారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.