బాబు టెలికాన్ఫరెన్స్ : రెండు పార్టీలు మోడీ వైపే

  • Published By: madhu ,Published On : January 18, 2019 / 04:14 AM IST
బాబు టెలికాన్ఫరెన్స్ : రెండు పార్టీలు మోడీ వైపే

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోతోంది. కేటీఆర్ – జగన్‌ల భేటీ అనంతరం ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. రాజకీయ పరిణామాలను సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిశితంగా పరిశీలిస్తున్నారు. టీఆర్ఎస్ – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఆ రెండు పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 
జనవరి 18వ తేదీ శుక్రవారం ఆ పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు..తెలియచేశారు. ఈ సందర్భంగా బాబు పలు వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో బీజేపీయేతర్ పార్టీల ర్యాలీకి హాజరవుతున్నట్లు వెల్లడించారు. టీఆర్ఎస్, వైసీపీ మినహా అందరూ కోల్‌కతాకు వస్తున్నారని…ఈ రెండు పార్టీలు ఎక్కడన్నాయో అందరికీ తెలిసిపోతోందని…మోడీ అనుకూల కూటమి ఒకటి..వ్యతిరేక కూటమి..ఇలా రెండే ఉన్నాయన్నారు. టీఆర్ఎస్, వైసీపీ మోడీ అనుకూల కూటమిలో ఉన్నట్లేనని చెప్పుకొచ్చారు. అసత్యాలతో దుష్ప్రాచారం చేసేందుకే కడపలో సభ పెడుతున్నారని విమర్శించారు. అక్కడి ప్రజలే గట్టి సమాధానం చెబుతారని పేర్కొన్నారు. తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుండి తొలగించారన్న బాబు…ఇక్కడకొచ్చి బీసీల సంక్షేమంపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని బాబు చెప్పుకొచ్చారు.