సంక్షేమ మాసం : ఏపీ ప్రజలకు ప్రతి నెలా పండుగే

  • Published By: veegamteam ,Published On : September 6, 2019 / 08:30 AM IST
సంక్షేమ మాసం : ఏపీ ప్రజలకు ప్రతి నెలా పండుగే

శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఏడాది కాలంలో చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఎవరు ఊహించని విధంగా క్యాలెండర్ ను ప్రకటించి సంచలనం సృష్టించారు జగన్.

విశాఖ నుంచి హెలికాప్టర్‌లో పలాస చేరుకున్న జగన్… అక్కడ.. కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌తో కూడిన 200 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం నిర్మించనున్న జెట్టీకి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా జగన్ తన 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ను వివరించారు. అంతే కాదు భవిష్యత్తులో అమలు చేయబోయే పథకాల క్యాలెండర్ ను వెల్లడించారు. సెప్టెంబర్‌ నుంచి ఏప్రిల్ వరకు వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తానంటూ క్యాలెండర్‌ విడుదల చేసి… సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టారు జగన్. 

> సెప్టెంబర్ నెల చివరి కల్లా స్వంత ఆటో, స్వంత ట్యాక్సీ నడుపుకుంటున్న వారికి రూ.10 వేలు ఇవ్వనున్నాం.
> అక్టోబర్ 15 వ తేదీన రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం. ప్రతి ఒక్క రైతు కుటుంబానికి రూ. 12 వేల 500 ఇవ్వనున్నాం. 
> నవంబర్ 21 వ తేదీ నుంచి వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడి కుటుంబానికి రూ.10 వేల రూపాయలు అందజేస్తాం. ప్రతి జిల్లాలో గ్రామాల్లో బంకులను డెడికేడ్ చేసి…అక్కడికి వెళ్లి పెట్రోల్, డీజిల్ పోయించుకోవచ్చని, ఇందుకు రూ.9 సబ్సిడీ ఇవ్వనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. 
> డిసెంబర్ నెలలో మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి నేరుగా ఇంటికి వచ్చి రూ.24 వేల రూపాయలను ఇవ్వనున్నట్లు తెలిపారు. 
> జనవరి 26 న అమ్మఒడికి శ్రీకారం చుడతామని చెప్పారు. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
> ఫిబ్రవరి చివరి వారంలో కటింగ్ షాపులు ఉన్న నాయి బ్రాహ్మణులకు టైలర్లు, రజకులు రూ.10 వేలు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. 
> మార్చి నెలలో అర్చకులకు, ఇమామ్ లు, మౌజాంలు, ఫాస్టర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయనున్నట్లు తెలిపారు.
> ఉగాది రోజున ఇళ్ల స్థలం లేని ప్రతి అక్కచెల్లెమ్మళ్లకు 25 లక్షల ఇళ్లపట్టాల రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లు చెప్పారు.
> ఏప్రిల్ నెలలో వచ్చే శ్రీరామనవమి పండుగ రోజున వైఎస్సార్‌ పెళ్లికానుక అమలు చేస్తామని సీఎం జగన్‌ చెప్పారు.

Also Read : వైసీపీ వందరోజుల పాలన : వింటున్నారు..చూస్తున్నారు…చేస్తున్నారు