జగన్ సంచలన నిర్ణయం : ఏపీ గ్రామాల్లో మహిళా పోలీసులు

  • Published By: veegamteam ,Published On : August 30, 2019 / 12:43 PM IST
జగన్ సంచలన నిర్ణయం : ఏపీ గ్రామాల్లో మహిళా పోలీసులు

మద్య నిషేధం అమలు దిశగా ఏపీలో కీలక అడుగులు పడుతున్నాయి. ఏపీలో మద్య నిషేధంపై సీఎం జగన్ ట్వీట్ చేశారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం ఫలితంగా మద్యం వినియోగం భారీగా తగ్గుతోందన్నారు. అక్టోబర్ నుంచి 20 శాతం మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యను తగ్గిస్తామని చెప్పారు. అక్రమ మద్యం, నాటుసారా తగ్గించేందుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమిస్తామని చెప్పారు. దశలవారీగా మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వైసీపీ అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో దశల వారిగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు.

ప్రభుత్వమే స్వయంగా మద్యం వ్యాపారంలోకి ప్రవేశించనుంది. అందుకు వీలు కల్పించేలా చట్టాన్ని మార్చాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును మంత్రివర్గం నిన్న ఆమోదించింది. చట్ట సవరణ తరువాత 2019, అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రైవేటు మద్యం దుకాణాల స్ధానంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభం అవుతాయి.

ఈ బిల్లులోని ముఖ్య అంశాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఇప్పటివరకూ డిస్టలరీలు, బ్రూవరీస్‌ల్లో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి, మద్యం లైసెన్సుదారులకు విక్రయించటానికే పరిమితం కాగా, ఇకపై స్వయంగా మద్యం దుకాణాలను నడపనుంది.

Also Read : ఐదురోజుల క్రితం అదృశ్యమైన బాలుడు దారుణ హత్య !