ఇడుపులపాయలో శిశువును ఆశీర్వదించిన జగన్‌ దంపతులు

  • Edited By: sreehari , September 2, 2020 / 07:02 PM IST
ఇడుపులపాయలో శిశువును ఆశీర్వదించిన జగన్‌ దంపతులు

YSR Death Anniversary: వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా
ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో జగన్ పాల్గొన్నారు. అక్కడి పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజలతో ముచ్చటించారు.ప్రజా రంజక పాలనతో పాటు తనను అభిమానించే వారితో మాట్లాడుతూ ముందుకు సాగారు.. సంక్షేమ సారథిగా పాలన సాగిస్తున్న వైఎస్ జగన్ ప్రజా నేతగా అందరి ఆదరణ పొందుతున్నారు. అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ సంక్షేమ సారథిగా చేయూత అందిస్తున్నారు.

తనను కలిసేందుకు వచ్చిన ప్రతి అభిమానిని చిరునవ్వుతో పలకరిస్తూ తండ్రిని తలపిస్తున్నారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన జ్యోతి అనే మహిళా అభిమాని సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చింది.. పుట్టిన బిడ్డతో వచ్చిన ఆమె సీఎం జగన్‌ దంపతులను కలుసుకుంది.ఈ సందర్భంగా తన బిడ్డను జగన్ దంపతులు ఆశీర్వదించాలని కోరింది. సీఎం వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి వైఎస్‌ భారతి ఆ చిన్నారిని ఆశీర్వదించారు.. మహిళా అభిమాని జ్యోతి శిశువును జగన్ తన రెండు చేతుల్లోకి తీసుకుని ఆడించారు.