కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు : ఏపీ డీజీపీ అత్యవసర మీటింగ్

  • Published By: madhu ,Published On : May 8, 2019 / 01:08 PM IST
కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు : ఏపీ డీజీపీ అత్యవసర మీటింగ్

ఆంధ్రప్రదేశ్‌ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారా ? రాష్ట్రంలోకి చొచ్చుకొని వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా ? అంటే ఎస్ అని సమాధానం వస్తోంది. కేంద్ర నిఘా వర్గాలు ఏపీ రాష్ట్ర పోలీసులను అలెర్ట్ చేశాయి. శ్రీలంక ఉగ్రదాడి అనంతరం ఏపీకి కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు చేసింది. దీంతో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ మే 08వ తేదీ బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. 

అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇస్లామిక్‌, వామపక్ష తీవ్రవాదం హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం, వాహనాలు, హోటళ్లలో తనిఖీలు పెంచాలని ఆదేశించారు. 

ఇటీవలే శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిలో     321 మందికి పైగా చనిపోయారు. 500 మందికిపైగా గాయపడ్డారు. అనంతరం ఉగ్రవాదులను ఏరివేసేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఏపీ పోలీసులు అలెర్ట్‌గా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. ఎన్నికల కౌంటింగ్‌పై జిల్లా ఎస్పీలతో డీజీపీ మాట్లాడారు.