చంద్రబాబు సమీక్షలపై సీఎస్‌ వివరణ ఇవ్వాలి : ఈసీ

  • Published By: madhu ,Published On : April 19, 2019 / 10:39 AM IST
చంద్రబాబు సమీక్షలపై సీఎస్‌ వివరణ ఇవ్వాలి : ఈసీ

APలో ఎన్నికల పోలింగ్ అయిపోయింది. ఓట్ల లెక్కింపు ఎప్పుడు జరుగుతుందా ? అని నేతలు వెయిటింగ్ ఒకవైపు.. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ మరోవైపు నెలకొంది. ఈ మధ్యలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో రాజకీయాలు వేడి వేడిగా ఉంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ..అధికారపక్షం టీడీపీ మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఏదో అంశం తెరమీదకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తోంది ప్రతిపక్షం.

తాజాగా సీఎం బాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఆరోపించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత సెక్రటేరియట్‌‌లో అధికారులతో ముఖ్యమంత్రి బాబు సమీక్షలు నిర్వహించడం ఏంటనీ ప్రశ్నిస్తోంది వైసీపీ. దీనిపై EC ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలంటూ AP CSని కోరింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో సీఎస్ చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. 
సమీక్షల్లో అధికారులు పాల్గొనడంపై వివరణ ఇవ్వాలని సీఆర్డీఏ, జనవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. సీఎస్. సంజాయిషీ ఇవ్వాలని సీఎస్ ఆదేశాల్లో వెల్లడించారు. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లు బాబు నిర్వహించకూడదని ఎన్నికల నియమావళి చెబుతుందని ఎన్నికల కమిషన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.