ముగిసిన కోడెల అంత్యక్రియలు…జన సంద్రమైన నరసరావుపేట

ముగిసిన కోడెల అంత్యక్రియలు…జన సంద్రమైన నరసరావుపేట

సరసరావు పేటలోని స్వర్గపురిలో అభిమానుల అశ్రునయనాల మధ్య కోడెల శివప్రసాద్ రావు అంత్ర్యక్రియలు ముగిశాయి. పెద్ద కుమారుడు కోడెల శివరాం తండ్రి అంత్యక్రియలు ముగించారు. కొడెల అంత్యక్రియల్లో భారీగా అభిమానులు,కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు,లోకేష్,ఎమ్మెల్యే బాలకృష్ణ సహా పలువురు టీడీపీ నాయకులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

కోడెలకు కడసారి అంతిమ వీడ్కోలు పలికేందుకు తెలుగుదేశం కార్యకర్తలు, కోడెల బంధువులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నరసరావు పేటకు తరలివచ్చారు. దీంతో నరసరావు పేట జనసంద్రోహంగా మారింది. ఈ అంతిమ యాత్రకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.కోట నుంచి మెయిన్ రోడ్ మీదుగా సర్గపురికి అంతిమయాత్ర చేరింది.

అయితే అంతిమ యాత్ర సమయంలో నరసరావుపేట మల్లమ్మ సెంటర్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కోడెల అంతిమ యాత్ర ఎమ్మెల్యే గోపీరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఇంటి ముందు నుంచి వెళుతుండడంతో పోలీసులు అడ్డుకుని అంతిమయాత్ర వాహనాలను అనుమతించలేదు. దీంతో పోలీసులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీయడంతో అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితి సరిద్దారు.