రీ టెండర్ టైమ్ : పోలవరం రివర్స్ టెండర్..బిడ్లు ఓపెన్

  • Published By: madhu ,Published On : September 23, 2019 / 01:10 AM IST
రీ టెండర్ టైమ్ : పోలవరం రివర్స్ టెండర్..బిడ్లు ఓపెన్

పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ హెడ్ వర్క్స్, హైడల్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రివర్స్ టెండర్లను.. కొన్ని గంటల్లో ఏపీ ఇరిగేషన్ శాఖ ఓపెన్ చేయనుంది. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు ధవళేశ్వరం దగ్గరున్న పోలవరం ప్రాజెక్ట్ హెడ్ ఆఫీస్‌లో.. రివర్స్ టెండర్లను ప్రారంభించనున్నారు. హైడల్ ప్రాజెక్ట్‌కు రూ. 3 వేల 261 కోట్ల అంచనా వ్యయం, పెండింగ్ హెడ్ వర్క్స్ పనులకు రూ. 17 వందల 71 కోట్ల అంచనాతో టెండర్లను పిలిచారు.

ఇప్పటికే.. రూ. 3 వేల 4 వందల కోట్లకు నవయుగ కంపెనీ పోలవరం హెడ్ వర్క్స్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. అందులో.. 16 వందల కోట్ల మేర పనులు పూర్తి చేసింది. ఇందులో మిగిలిన.. 17 వందల 71 కోట్ల పనులకు రీ టెండర్ నిర్వహిస్తున్నారు. ఒక్క దీనికి మాత్రమే రీ టెండర్ పిలిస్తే నష్టాలొస్తాయని భావించి.. హైడల్ ప్రాజెక్ట్ పనులకు కూడా రీ టెండర్ నిర్వహిస్తున్నారు. దీని ద్వారా.. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలోనే డబ్బు మిగిలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పోలవరం పనుల కాంట్రాక్టు నుంచి తమను తొలగించడంపై.. నవయుగ కంపెనీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై వాదనలు ముగిసినా కోర్టు ఇంకా తీర్పు చెప్పలేదు. ఇంతలోనే.. ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్తోంది. ఇది పూర్తయ్యేసరికి.. 3 నుంచి 4 వారాల టైం పడుతుంది. తీర్పు కోసం వేచి చూడకుండా.. టైమ్ సేవ్ చేసేందుకే ముందుకెళ్లినట్లు ప్రభుత్వం చెబుతోంది. రివర్స్ టెండరింగ్‌లో కాంట్రాక్ట్ దక్కించుకున్న కంపెనీకి.. కోర్టు తీర్పు తర్వాతే పనులు అప్పగించనున్నారు. ఒక వేళ కోర్టు తీర్పు.. నవయుగ కంపెనీకి అనుకూలంగా వస్తే.. సుప్రీంను ఆశ్రయించే యోచనలో ఉంది జగన్ ప్రభుత్వం.
Read More :