జగన్ కీలక నిర్ణయం : బోటు వెలికితీత పనులు మెరైన్స్ కంపెనీకి అప్పగింత

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో గోదావరి నదిలో ప్రమాదానికి గురైన బోటును వెలికి తీసేందుకు బాలాజీ మెరైన్స్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. బోటుని తీసేందుకు

  • Published By: veegamteam ,Published On : September 28, 2019 / 12:36 PM IST
జగన్ కీలక నిర్ణయం : బోటు వెలికితీత పనులు మెరైన్స్ కంపెనీకి అప్పగింత

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో గోదావరి నదిలో ప్రమాదానికి గురైన బోటును వెలికి తీసేందుకు బాలాజీ మెరైన్స్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. బోటుని తీసేందుకు

బోటు ప్రమాదం విషయంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బోటు వెలికితీత పనులను మెరైన్స్ కంపెనీకి అప్పగించింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో గోదావరిలో ప్రమాదానికి గురైన బోటును వెలికి తీసేందుకు బాలాజీ మెరైన్స్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. బోటుని తీసేందుకు రూ.22.70 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రంగంలోకి దిగిన బాలాజీ మెరైన్స్ సిబ్బంది.. సోమవారం( సెప్టెంబర్ 30,2019) నుంచి గల్లంతైన ప్రాంతంలో వెలికితీత పనులు ప్రారంభించనుంది.

సెప్టెంబర్ 15, 2019 తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో టూరిస్ట్ బోటు రాయల్ వశిష్ట ప్రమాదానికి గురైంది. బోటులో 61 మంది ప్రయాణికులతో పాటు 10 మంది సిబ్బంది ఉన్నారు. బోటు ప్రమాదంలో 36 మృతదేహాలు లభ్యం అయ్యాయి. 14 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. బోటు వెలికితీత కోసం ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. అయినా ఫలితం లేకపోయింది. పొరుగు రాష్ట్రాల నుంచి నిపుణులను రప్పించినా వారు కూడా బోటుని వెలికి తియ్యలేకపోయారు. కాగా, ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చర్యలు చేపడతామని ప్రభుత్వం తెలిపింది. ఇకపై బోట్లలో జీపీఎస్, నావిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు చెప్పింది. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు కూడా ఆదేశించింది.