క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారికి రూ.2వేలు ఆర్థిక సాయం, సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ పంజా విసురుతోంది. ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుల్వం అలర్ట్

  • Published By: veegamteam ,Published On : April 16, 2020 / 08:57 AM IST
క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారికి రూ.2వేలు ఆర్థిక సాయం, సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ పంజా విసురుతోంది. ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుల్వం అలర్ట్

ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ పంజా విసురుతోంది. ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుల్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్న జగన్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందులో భాగంగా క్వారంటైన్ పూర్తి చేసుకున్నవారికి రూ.2వేలు ఆర్థికసాయం అందించనుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక పౌష్టికాహారం తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ఆర్థికసాయం ఇవ్వనుంది. అలాగే రానుపోను చార్జీల కోసం మరో రూ.600 ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

కరోనా పాజిటివ్ బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని రోజుల పాటు ప్రత్యేక ట్రీట్ మెంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. పరిస్థితులను బట్టి కొన్ని రోజుల పాటు క్వారంటైన్ లేదా ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో వారికి ఆర్థికంగా అండగా ఉండాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనాపై విజయం సాధించాలంటే రోగ నిరోధక శక్తి చాలా అవసరం. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. అందుకే తామీ పని చేశామని ప్రభుత్వం చెబుతోంది.

కడపలో కరోనా నుంచి కోలుకున్న 13మంది:
మరోవైపు కడపలో 13మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న 13మందిని ఫాతిమా మెడికల్ కాలేజీ ఆసుపత్రి నుంచి గురువారం(ఏప్రిల్ 16,2020) డిశ్చార్జ్ అయ్యారు. 13మందికి నెగెటివ్ రావడంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన వారిని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పరామర్శించారు. వారందరికి ప్రభుత్వం తరపున రూ.2వేలు చొప్పున అందజేశారు.

ఇకపై ఇంట్లోనే కరోనా వైద్యపరీక్షలు:
ఓవైపు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటూనే, మరోవైపు కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇప్పటికే టెలి మిడిసిన్, వాట్సాప్ ఛాట్ బాట్ లాంటి వినూత్న సదుపాయాల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా కట్టడికి రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా మాస్కులు పంపిణీ చేయబోతున్నారు. ఒక్కొక్కిరికి మూడు మాస్కులు ఇవ్వనున్నారు. ఇప్పుడు కరోనాపై పోరులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంట్లోనే కరోనా వైద్యపరీక్షలు చేయబోతున్నారు.

ఇకపై ఐసొలేషన్ వార్డులకు తీసుకెళ్లరు:
అవును.. అనుమానిత రోగుల్ని ఇకపై ఐసొలేషన్ వార్డులకు తీసుకెళ్లరు. ఇంట్లోనే పరీక్షలు నిర్వహిస్తారు. టెస్టుల్ని కూడా ఉచితంగా నిర్వహిస్తారు. పాజిటివ్ అని తేలిన తర్వాత మాత్రమే ఐసొలేషన్ వార్డులకు తరలిస్తారు. అయితే టెస్టులు పూర్తయి, ఫలితాలు వచ్చేంత వరకు మాత్రం అనుమానితులంతా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలి.

తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడే వారు ఎవరైనా ఈ సేవలు పొందొచ్చు:
తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడే వారు ఎవరైనా ఈ సేవలు పొందవచ్చని.. ఒకవేళ కరోనా కాదని నిర్థారణ అయితే.. సాధారణ మందులు కూడా అక్కడికక్కడే వైద్యులు అందిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మరింత మంది వైద్య సిబ్బందిని తీసుకునేందుకు 2 రోజుల కిందట నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.