రైతులపై వరాల జల్లు : రూ.2 లక్షల కోట్లతో బాబు భారీ బడ్జెట్

అమరావతి: ఎన్నికల వేళ... ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. మరి యనమల పద్దులు ఎలా ఉండబోతున్నాయి. జనాకర్షకంగా ఉంటుందా... రైతులపై వరాలు

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 03:36 AM IST
రైతులపై వరాల జల్లు : రూ.2 లక్షల కోట్లతో బాబు భారీ బడ్జెట్

అమరావతి: ఎన్నికల వేళ… ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. మరి యనమల పద్దులు ఎలా ఉండబోతున్నాయి. జనాకర్షకంగా ఉంటుందా… రైతులపై వరాలు

అమరావతి: ఎన్నికల వేళ… ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. మరి యనమల పద్దులు ఎలా ఉండబోతున్నాయి. జనాకర్షకంగా ఉంటుందా… రైతులపై వరాలు కురుస్తాయా.. సంక్షేమం.. నీటి పారుదల రంగానికి పెద్ద పెద్ద పీట వేస్తారా.. ఎలాంటి కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. 4 నెలల బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం ఏఏ అంశాలను పేర్కొంటుందా అనే ఆసక్తి ఏర్పడింది. ఉదయం 11.45 గంటలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అటు శాసనమండలిలో మంత్రి నారాయణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

 

ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం రైతులకు వరాలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఏడు బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. 2018లో లక్షా 93వేల కోట్ల రూపాయలతో బడ్జెట్  ప్రవేశపెట్టగా.. ఈసారి 2లక్షల 26వేల కోట్ల మేర బడ్జెట్ అంచనాలు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. 2019 జనవరి 30న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు  కొనసాగనున్నాయి. ఎన్నికల వేళ అన్ని వర్గాల ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రజాకర్షక తాయిలాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. రైతులకు వరాలు కురిపించడంతో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్‌లో పెద్ద పీట వేస్తారని చెబుతున్నారు.

 

* ఉదయం 11.45కు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి యనమల
* శాసన మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి నారాయణ
* రూ.2.26 లక్షల కోట్ల మేర బడ్జెట్‌ ఉండే అవకాశం
* రూ.1.80 లక్షల కోట్ల మేర రెవెన్యూ వ్యయం
* రూ.29వేల క్యాపిటల్‌ వ్యయం ఉండే అవకాశం
* బడ్జెట్‌లో ఎన్నికల వరాలకు ప్రాధాన్యత
* రైతులకు వరాలు
* రైతులకు హెక్టార్‌కు రూ. 10 నుంచి 12 వేల మేర పెట్టుబడి సాయం ప్రకటించే అవకాశం
* నిరుద్యోగ భృతి రెట్టింపు(రూ2వేలు) చేసే అవకాశం
* మహిళలు, యువతకు పెద్ద పీట
* పేద, బడుగు బలహీనవర్గాలపై వరాల జల్లు

 

బడ్జెట్‌లో కేటాయింపులు:
* గ్రామీణాభివృద్ధికి రూ.32వేల కోట్లు కేటాయించే ఛాన్స్
* మానవ వనరుల అభివృద్ధికి రూ.25వేల కోట్లు
* నీటి పారుదల శాఖకు రూ.16వేల కోట్లు
* వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.15వేల కోట్లు    
* విద్యాశాఖకు రూ.25వేల కోట్లు, సంక్షేమానికి రూ.16 వేల కోట్లు
* వైద్య, ఆరోగ్యానికి రూ.10వేల కోట్లు కేటాయించే అవకాశం