అమరావతిలో హెరిటేజ్ ఫుడ్స్ కి 14.22ఎకరాలు, బాలకృష్ణ వియ్యంకుడికి 499ఎకరాలు : బుగ్గన చెప్పిన భూముల వివరాలు

  • Published By: veegamteam ,Published On : December 17, 2019 / 11:37 AM IST
అమరావతిలో హెరిటేజ్ ఫుడ్స్ కి 14.22ఎకరాలు, బాలకృష్ణ వియ్యంకుడికి 499ఎకరాలు : బుగ్గన చెప్పిన భూముల వివరాలు

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు(డిసెంబర్ 17,2019) రాజధాని అమరావతి, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వాడీవేడి చర్చ జరిగింది. రాజధానిపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో రాజధాని పేరుతో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలో భూ యజమానుల వివరాలను ఆయన సభలో బయటపెట్టారు. ఎవరెవరు భూములు కొన్నారు, ఎన్ని ఎకరాలు కొనుగోలు చేశారు అనే వివరాలను మంత్రి వెల్లడించారు.

స్థానికులు కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి భూములు ఎలా కొన్నారని మంత్రి బుగ్గన ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారని మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు తన మనుషులకు, టీడీపీ నేతలకు అప్పనంగా భూములు అప్పగించారన్నారు. రాజధాని ప్రకటన రాకముందే..2014 జూన్ నుంచి 6 నెలల్లోనే 4,070 ఎకరాలు కొనేశారు అంటే… ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ కాకపోతే మరేంటి? అని మంత్రి బుగ్గన ప్రశ్నించారు.

అమరావతి ప్రాంతంలో భూములు కొన్న వారి వివరాలు:
* హెరిటేజ్ ఫుడ్స్ పేరుతో 14.22 ఎకరాలు కొనుగోలు
* మాజీ మంత్రి నారాయణ తన బంధువుల పేరుతో 55.27 ఎకరాలు కొనుగోలు
* ప్రత్తిపాటి పుల్లారావు తన బంధువుల పేరుతో 38 ఎకరాలు కొనుగోలు
* బాలకృష్ణ వియ్యంకుడికి 499 ఎకరాలు ఇచ్చారు
* వేమూరి రవి కటుంబం 62.77 ఎకరాలు కొనుగోలు
* లింగమనేని రమేష్ 351.25 ఎకరాలు కొన్నారు
* రాయపాటి సాంబశివరావు 55.27 ఎకరాలు కొన్నారు
* ధూలిపాళ్ల నరేంద్రకు 13 ఎకరాలు

* రావెల కిషోర్ బాబుకి చెందిన మైత్రీ ఇన్ ఫ్రాకు 40.85 ఎకరాలు
* కొమ్మాలపాటి శ్రీధర్ కు 68.60 ఎకరాలు
* జీవీఎస్ ఆంజనేయులుకు 37.24 ఎకరాలు
* పయ్యావుల కేశవ్ కు 15.30 ఎకరాలు
* పల్లె రఘునాథ్ రెడ్డికి 7.56 ఎకరాలు

* పరిటాల సునీత కూతురు, అల్లుడి పేరుతో భూములు
* 2014 జూన్ నుంచి 6 నెలల్లోనే 4,070 ఎకరాలు కొనుగోలు
* చౌక ధరకు భూములిచ్చి దాన్ని సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చారు
* చంద్రబాబు తన మనుషులకు లాభం కలిగే విస్తీర్ణాన్ని సెట్ చేశారు
* అమరావతి రాజధాని ప్రకటనకు ముందే భూముల కొనుగోలు
* చంద్రబాబు తన మనుషుల భూముల పక్క నుంచే రింగ్ రోడ్డు వెళ్లేలా ప్లాన్ చేశారు