సరికొత్త అందం : అన్నవరం రైల్వేస్టేషన్‌లో మొక్కల బెంచీలు

  • Published By: veegamteam ,Published On : December 5, 2019 / 06:03 AM IST
సరికొత్త అందం : అన్నవరం రైల్వేస్టేషన్‌లో మొక్కల బెంచీలు

సత్యదేవుని సన్నిధి అయిన అన్నవరం రైల్వేస్టేషన్‌లో ప్రయాణీకుల కోసం  రైల్వే శాఖ చక్కటి అందమైన బెంచీలను ఏర్పాటు చేసింది. ప్రయాణీకులు కూర్చోవటానికి మొక్కల బెంచీలను ఏర్పాటు చేసింది. అందంగా కనిపించటమే కాదు..చక్కగా పచ్చని మొక్కల పక్కన కూర్చున్న ఫీలింగ్ కలుగుతోంది.

భారతీయ రైల్వేశాఖ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అందంగా సౌకర్యవంతంగా తీర్చి దిద్దుతోంది. దీంట్లో భాగంగా అన్నవరం రైల్వే స్టేషన్‌లో…ప్రయాణీకులు కూర్చోవటానికి 
మొక్కల బెంచీలను ఏర్పాటుచేసింది. తక్కువ ప్లేస్ లో ఆహ్లాకరమైన మొక్కల పక్కనే కూర్చునేలా చేసిన ఈ ఏర్పాట్లపై ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

అన్నవరం రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ నెంబర్ 1 లో ఈ కొత్త బెంచీలు ప్రయాణీకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ట్రైన్ లేట్ అయినా ఏమాత్రం బోర్ కొట్టకుండా చక్కగా మొక్కల బెంచీలపై కూర్చునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మొక్కల బెంచీలపై ఓ ఫ్యామిలీ కూర్చోవడానికి..చాలా కంఫర్టబుల్ గా ఉంటున్నాయి.

బెంచీకి మొక్కల్ని కూడా నాటడం ప్లాట్ ఫారం సరికొత్త అందాన్ని సంతరించుకుంది. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో ఈ స్టేషన్ ఎప్పుడూ రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో ఈ మొక్కల బెంచీలు ఆహ్లాదాన్నికలిగిస్తున్నాయి. అవసరాన్ని బట్టి ఈ బెంచీలను ఎక్కడికైనా మార్చుకునే వీలు కూడా ఉంది. ఖర్చు తక్కువ. తక్కువ స్థలం కూడా ఈ బెంచీలు ఇట్టే అమరిపోతాయి. బాగుంది కదూ రైల్వే శాఖ మొక్కల బెంచీల ఐడియా..