ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ నిలిపివేత

  • Published By: veegamteam ,Published On : March 27, 2019 / 11:44 AM IST
ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ నిలిపివేత

అమరావతి : ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేశారు. నింబంధనల ప్రకారం ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు ఈసీ పరిధిలోకి రాకపోవడంతో ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులను రద్దు చేసింది. ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేస్తూ ఈసీ నిన్న ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను మాత్రమే బదిలీ చేస్తూ కొత్త జీవో జారీ చేశారు. ఏపీ చీఫ్ సెక్రటరీ పునేఠా ఈ జీవోను ఇచ్చారు. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంటకరత్నంను విధుల నుంచి తప్పించాల్సిందిగా సీఈసీ ఆదేశించింది. అయితే ఇవాళా ఏపీ చీఫ్ సెక్రటరీ పునేఠా ఆగమేఘాల మీద ఓ జీవో విడుదల చేశారు. 

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 18 నుంచి ఎన్నికల తంతు ముగిసే వరకు (మే 27 వ తేదీ) డీజీపీ మొదలుకొని అన్నీ రీజియన్ల ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు అన్నీ రీజియన్ల డిప్యూటీ ఇన్ స్పెక్టర్స్ ఆఫ్ జనరల్ పోలీసులు, పోలీస్ కమిషనర్స్, ఎస్పీలతోపాటు కానిస్టేబుల్స్ వరకు ఎన్నికల విధుల్లో ఉంటారని జీవోలో తెలిపారు. అయితే ఈ జీవోలో ఇంటెలిజెన్స్ డీజీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొనకుండానే జీవోలో ఆయన లేరు కాబట్టి ఇంటెలిజెన్స్ డీజీకి ఒక కొత్త జీవోను విడుదల చేశారు. ఎన్నికల విధుల్లో లేనటువంటి ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు బదిలీ కాకుండా మరొక జీవోను విడుదల చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను బదిలీ చేశారు.

శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా ఉన్న వెంకటరత్నం కెరీర్ ఎస్ ఐగా మొదలుకొని.. నాన్ క్యాడర్ ఆఫీసర్ వరకు ఎదిగారు. అయితే ప్రభుత్వం ఆయనకు ఐపీఎస్ ఇవ్వలేదు. ఐపీఎస్ ఇవ్వకుండానే శ్రీకాకుళం ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. కావాలనే వెంకటరత్నం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కాబట్టే ఆయన్ను శ్రీకాకుళం ఎస్పీగా నియమించడం జరిగిందని వైసీపీ ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వీరిద్దరినీ బదిలీ చేశారు. ఎన్నికల విధులు నిర్వహించని ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును బదిలీ చేయకుండా ఉత్తర్వులు జారీ చేశారు.