ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి దేవినేని : అర్ధరాత్రి తోపుడు బండ్ల పంపిణీ

ఏపీ మంత్రి దేవినేని ఉమా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి గ్రామంలో తోపుడు బండ్లను పంపిణీ చేశారు.

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 05:07 AM IST
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి దేవినేని : అర్ధరాత్రి తోపుడు బండ్ల పంపిణీ

ఏపీ మంత్రి దేవినేని ఉమా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి గ్రామంలో తోపుడు బండ్లను పంపిణీ చేశారు.

కృష్ణా : ఏపీ మంత్రి దేవినేని ఉమా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి గ్రామంలో తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనే టీడీపీ నేతలతో కలిసి ఆయన అర్ధరాత్రి వాటిని పంపిణీ చేశారు. గత రెండు రోజుల నుంచి దేవినేని ఆ ప్రాంతంలో తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నాయకులను అక్కడే ఉంచి వాటిని తయారు చేయించి అర్ధరాత్రిళ్లు పంపిణీ చేస్తున్నారు.
Also Read : ఐటీ గ్రిడ్ వివాదం: జడ్జి ముందుకు ఆ నలుగురు

అన్ని తోపుడు బండ్లకు పసుపు రంగు వేసి, వాటిపై దేవినేని ఉమా, సీఎం చంద్రబాబు ఫొటోలు ముద్రిస్తున్నారు. రాత్రి పూట ప్రతి ఇంటికి వెళ్లి వాటిని ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వాలని, ఓటేయాలని టీడీపీ నేతలు అడుగుతున్నారు. దీనికి సంబంధించి పలువురు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు.

వారం రోజుల క్రితం వైసీపీకి చెందిన నేతలు కిట్ లు పంపిణీ చేస్తున్నప్పుడు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కిట్ లను స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేశారు. ఈనేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలు ఉన్న సమయంలో గత రెండు రోజులుగా రాత్రి పూట టీడీపీ నేతలు తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై వైసీపీ నేతలతోపాటు పలువురు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామంటున్నారు. పోలీసులు ఎందుకు నిఘా పెట్టలేదని, మంత్రి బండ్లను పంపిణీ చేస్తున్నా.. ఎందుకు స్పందించ లేదని ప్రశ్నిస్తున్నారు.
Also Read : డేటా దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ పరువు తీశారు : లోకేష్