పోలింగ్ డే : ఏపీ పంచాయతీ సంగ్రామం

పోలింగ్ డే : ఏపీ పంచాయతీ సంగ్రామం

[svt-event title=”12 జిల్లాల్లో 18 రెవిన్యూ డివిజన్లలో తొలి దశ పోలింగ్ ” date=”09/02/2021,8:14AM” class=”svt-cd-green” ] రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, అనకాపల్లి, కాకినాడ, పెద్దాపురం, నరసాపురం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, కావలి, చిత్తూరు, కదిరి, నంద్యాల, కర్నూలు, కడప, జమ్మలమడుగు, రాజంపేట రెవెన్యూ డివిజన్లలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరుగునున్నాయి.[/svt-event]

[svt-event title=”తొలిసారిగా ‘నోటా’” date=”09/02/2021,8:12AM” class=”svt-cd-green” ]విజయనగరం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’ను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరుగనుంది. కరోనా పాజిటివ్‌ బాధితులకు పీపీఈ కిట్లతో చివరిలో గంటసేపు అవకాశం కల్పించనున్నారు.సర్పంచ్ అభ్యర్థికి పింక్ బ్యాలెట్, వార్డు అభ్యర్థికి తెల్ల బ్యాలెట్‌ను కేటాయించారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నిక ఉంటుంది.[/svt-event]

[svt-event title=”నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం  వరకే పోలింగ్ ” date=”09/02/2021,7:40AM” class=”svt-cd-green” ] నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంటా 30 నిమిషాల వరకే ఎన్నికలు జరగనున్నాయి. సమస్యాత్మక గ్రామాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మొదటి విడతలో 2వేల 723 సర్పంచ్‌ స్థానాలకు, 20వేల 157 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్‌ అభ్యర్థులుగా 7వేల 506 మంది, వార్డులకు 43వేల 601 మంది పోటీపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటాను తీసుకొచ్చారు.[/svt-event]

[svt-event title=”కొనసాగుతున్న తొలి విడత పంచాయతీ పోలింగ్ ” date=”09/02/2021,7:35AM” class=”svt-cd-green” ] ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. విజయనగరం మినహా 12 జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3గంటల 30 నిమిషాల వరకు పోలింగ్‌ జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించి విజేతలకు డిక్లరేషన్లు అందజేస్తారు. వీలైతే ఇవాళే ఉప సర్పంచ్‌ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశముంది. లేకపోతే రేపు ఉప సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహిస్తారు.[/svt-event]

[svt-event title=”మధ్యాహ్నం 4గంటల నుంచి కౌంటింగ్ ” date=”09/02/2021,7:26AM” class=”svt-cd-green” ] మధ్యాహ్నం 4గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. కౌంటింగ్ కోసం 14వేల 535 సూపర్వైజర్లు, 37వేల 750 మంది సిబ్బంది పని చేస్తారు. కౌంటింగ్ ప్రక్రియ పోలింగ్ స్టేషన్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బొప్పనపల్లి, వడ్డిగూడెం గ్రామపంచాయతీల్లో నేడు జరగాల్సిన పోలింగ్‌ను రెండో దశకు వాయిదా వేశారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై తుదినిర్ణయం ఎస్ఈసీదేనని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.[/svt-event]

[svt-event title=” పంచాయతీ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం” date=”09/02/2021,7:20AM” class=”svt-cd-green” ] ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ తొలిదశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 6గంటల 30నిమిషాలకి మొదలైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రశాంతంగా ఎన్నికలు ముగించాలని ప్లాన్ చేసింది కమిషన్. చలి తీవ్రత కారణంగా ఓటర్లు కాస్త తక్కువగా ఉన్నారు. ఉదయం 8 నుంచి ఓటర్ల సంఖ్య పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. అనూహ్య ఘటనలు, బదిలీలు, లేఖాస్త్రాలు, ఫిర్యాదులు, ఆరోపణలు, ప్రత్యారోపణల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. [/svt-event]