ఇసుక మాఫియా ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్లింది బాబూ..

  • Published By: veegamteam ,Published On : November 26, 2019 / 04:40 AM IST
ఇసుక మాఫియా ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్లింది బాబూ..

మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే లెక్క సంవత్సరానికి వేస్తే వేల కోట్ల ఆదాయమే. ఇన్ని వేల కోట్ల ఆదాయం ఇసుకపై వస్తుంటే గతంలో ఈ ఇసుక ఆదాయం అంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది చెప్పండి  చంద్రబాబుగారూ? అంటూ ఎద్దేవా చేశారు. ఈ పచ్చ ఇసుక మాఫియా ద్వారా మీకూ వాటా ముట్టేది. అందుకే ఇసుక కొరతపై ఇంత రాద్ధాంతం చేస్తున్నారు..అంటూ చంద్రబాబుని   విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 

కాగా ఏపీలో ఇసుక కొరతపై గత కొంతకాలంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధాలు  కొనసాగుతున్నాయి. ఇసుక కొరత వల్లే భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారుంటూ విమర్శలు చేశాయి విపక్షాలు. దీనికి సంబందించి పలు నిరసన  కార్యక్రమాలను కూడా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎంపీ విజయసాయి మాజీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ హయంలో ఇసుక మాఫియాలకు తెరలేపారనీ..ఆ మాఫియా దందాలో చంద్రబాబు భారీగా డబ్బులు ముట్టేవని విమర్శించారు.