చంద్రబాబు..కరువు కవల పిల్లలు : స్పీకర్ తమ్మినేని

చంద్రబాబు, కరువు కవల పిల్లలనీ..వానలు కురిపించే వరుణుడికి సీఎం జగన్ అంటే చాలా ఇష్టమని అందుకే జగన్ సీఎం అయ్యాక ఏపీలో వర్షాలు భారీగా పడ్డాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇసుక కొరత గురించి చంద్రబాబు రాజకీయం చేస్తూ..రాద్ధాంతం చేస్తున్నారనీ విమర్శించారు.
భారీగా కురిసిన వర్షాల వల్లనే ఇసుక కొరత ఏర్పడిందనీ..ఆ సమస్యలకు సీఎం జగన్ పరిష్కారం చూపించేందుకు చర్యలు తీసుకున్నారని.. త్వరలోనే ఇసుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని అన్నారు. రైతు సంక్షేమం గురించి ఆలోచించిన వారు గత సీఎం వైఎస్సార్ ఈనాడు ఆయన కుమారుడు సీఎం జనగ్ మాత్రమేనన్నారు.