ఇదీ మా దౌర్భాగ్యం : అరగుండు..అర మీసంతో భిక్షాటన చేస్తున్న అమరావతి రైతులు

  • Published By: veegamteam ,Published On : December 23, 2019 / 05:13 AM IST
ఇదీ మా దౌర్భాగ్యం : అరగుండు..అర మీసంతో భిక్షాటన చేస్తున్న అమరావతి రైతులు

రాజధాని అమరావతి ప్రాంత రైతులు మూడు రాజధానులను నిరసిస్తూ వినూత్న నిరసనలకు దిగారు. ఆరవరోజున రైతులు నిరసనలో భాగంగా..ఓ రైతు సంగం గుండూ గీయించుకుని..మీసం కూడా సగం గీయించుకుని నిరసన వ్యక్తం చేశాడు. మరో రైతు మొక్కలను శరీరానికి కట్టుకుని ఇదీ మా దుస్థితి అంటూ తమ ఆవేదనను వెళ్లగ్రక్కుతున్నారు. 
రైతులతో పాటు మహిళలు కూడా రోడ్డుపై బైఠాయించి తమ ఆవేదనను అర్థం చేసుకోమంటూ ప్రభుత్వానికి మొర్రపెట్టుకుంటున్నారు.

రోడ్డుపైనే వంటలు చేసుకుంటూ అక్కడే పడుకుని మమ్మల్ని నడిరోడ్డుపై ఇటువంటి దుస్థితిలో కూర్చోపెట్టటం సరికాదు సీఎం జగన్ గారూ..ఆలోచించండి..మాకు దినాలు చేసి మీరు పుట్టిన రోజులు చేసుకుంటున్నారు..మీకు ఓట్లు వేసిన మాకు ఇటువంటి పరిస్థితుల్లోకి నెట్టి పాలకులు వేడుక చూస్తున్నారనీ..మీ రాజకీయ లబ్ది కోసం ప్రజల భవిష్యత్తును ఇలా కష్టాల్లోకి నెట్టటం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం పండే భూముల్ని రాజధాని అమరావతికి ఇస్తే..ఇప్పడు మూడు రాజధానులనీ..మీ భూములు మాకు అవరసం లేదనీ..ఇచ్చేస్తామని అంటున్నారు.

కానీ పంటలు పండే భూముల్ని మీకిస్తే వాటిని బీడువారేలా చేసి వాటిని మా మొఖాన కొడతామని అంటున్నారు..ప్రజల్ని బాధ పెట్టిన ఏ ప్రభుత్వం బాగుండదని ఇప్పటికైనా మూడు రాజధానుల నిర్ణయంపై ఆలోచించి..మా బాధల్ని అర్థం చేసుకోవాలని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు వేడుకుంటున్నారు.