కాకినాడలో కుంగిన ఐదు అంతస్తుల బిల్డింగ్

  • Published By: vamsi ,Published On : September 19, 2019 / 12:37 PM IST
కాకినాడలో కుంగిన ఐదు అంతస్తుల బిల్డింగ్

తూర్పు గోదావరి కాకినాడలో టెన్షన్.. టెన్షన్.. వాతావరణం ఏర్పడింది. కాకినాడ పట్టణంలోని దేవి మల్టీప్లెక్స్ దగ్గరలో ఐదు అంతస్తుల అపార్ట్ మెంట్ వెనుక భాగం కుంగిపోయింది. వెనుక భాగంలో మూడు పిల్లర్లు శిథిలమయ్యాయి. దీంతో ఐదు అంతస్తుల భవనం పక్కకు ఒరిగిపోయింది. ఏ క్షణమైనా కూలిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తుంది. పార్కింగ్ సెల్లార్ లోని పిల్లర్లు దెబ్బతిన్నాయి. దీంతో వెంటనే అందులో ఉన్న కుటుంబాలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. అపార్ట్ మెంట్ లో మొత్తం 40కుటుంబాలు ఉన్నాయి. అందులోని కుటుంబాలను సామాన్లతో సహా  ఖాళీ చేయించారు అధికారులు.

కూలేందుకు సిద్ధంగా ఉన్న బిల్డింగ్ ఐదు అంతస్తులు ఉండడంతో పక్కనే ఉన్న భవనాలు కూడా ఖాళీ చేయిస్తున్నారు. ఈ బిల్డింగ్ ను 13ఏళ్ల క్రితమే బిల్డర్లు కట్టినట్లుగా తెలుస్తుంది.