వారికి మాత్రమే : యాపిల్ కంపెనీ ప్రత్యేక మాస్కులు

  • Published By: nagamani ,Published On : September 11, 2020 / 10:52 AM IST
వారికి మాత్రమే : యాపిల్ కంపెనీ ప్రత్యేక మాస్కులు

Apple..ప్రముఖ టెక్ దిగ్గజం. యాపిల్ కంపెనీలో పనిచేయటానికి ఎంతోమంది ఇష్టపడుతుంటారు. యాపిల్ బ్రాండ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. యాపిల్ ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. ఈ కరోనా కాలంలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటోంది యాపిల్ కంపెనీ. తమ కంపెనీ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఫేస్‌ మాస్క్‌లను డిజైన్ చేసింది. కోవిడ్-19 నేపథ్యంలో ఈ ప్రత్యేక మాస్కులు తయారు చేస్తున్నట్లు యాపిల్ యాజమాన్యం తెలిపింది. ర్కొంది. కాలిఫోర్నియా టెక్నాలజీ దిగ్గజం క్యూపెర్టినో వీటిని తయారు చేసింది. దీనిని ‘క్రియర్ మాస్క్‌’లుగా పేరు పెట్టారు.



https://10tv.in/battery-made-from-nuclear-waste-that-can-last-28000-years/
ఈ ప్రత్యేక మాస్కులను ఇంజనీరింగ్..ఇండస్ట్రియల్ డిజైన్ టీమ్ లతో తయారు చేయించామని యాపిల్ తెలిపింది. ఈ టీమే ఐఫోన్, ఐపాడ్‌లకు సంబంధించిన పని చేస్తుంటాయి. మూడు పొరలతో ఉన్న ఈ ప్రత్యేక మాస్క్ వీలైనంత అద్భుతంగా ఇవి ఇన్‌కమింగ్ మరియు అవుట్గోయింగ్ కణాలను ఫిల్టర్ చేస్తుందని తెలిపింది. దీనిని ఐదు సార్లు వాష్ చేసి వాడుకోవచ్చట. ఈ మాస్కును త్వరలోనే విడుదల చేస్తామని యాపిల్ యాజమాన్యం పేర్కొంది. అంతేకాదు మాస్క్ పెట్టుకున్నామనే ఫీలింగ్ కానీ..ఇబ్బంది కానీ ఉండదట. ఈ మాస్క్ పెట్టుకున్నవారికే కాదు ఇతరులకు కూడా ఈ మాస్క్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి.


కాగా..కరోనా కాలంలో కరోనా వారియర్స్ గా సేవలందిస్తున్న వైద్య రంగంలో పని చేస్తున్న వారికి కూడా యాపిల్ కొన్ని ఫేస్ షీల్డ్ మాస్కులను తయారుచేసింది. లక్షల సంఖ్యలో ఈ మాస్కులను తయారు చేయించి వారికి పంపిణీ చేసింది.