కూల్ కూల్ : ఆర్టీసీ బస్టాండుల్లో కూలర్లు

  • Published By: madhu ,Published On : May 8, 2019 / 08:57 AM IST
కూల్ కూల్ : ఆర్టీసీ బస్టాండుల్లో కూలర్లు

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపెడుతున్నాడు. ఎండల భగభగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుండి బయటకు రావడానికే జంకుతున్నారు. కార్యాలయాలకు..వివిధ పనులకు వెళ్లే వారు అల్లాడిపోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు నానా అవస్థలు పడుతున్నారు. ఉక్కపోత, వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో వేసవి నుండి కొంత ఉపశమనం పొందే విధంగా APSRTC అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. బస్టాండుల్లో కూలర్లను ఏర్పాటు చేశారు. 

బస్సులు ఆలస్యమవ్వడంతో ఉక్కపోతకు చిన్నపిల్లలతో పాటు పెద్దలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి తాపం దృష్ట్యా విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్, కృష్ణా జిల్లాలోని పలు బస్టాండ్లతో పాటు గుంటూరు పరిధిలోని బస్టాండ్‌లలో ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా కూలర్లు ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు. బస్సు కోసం వచ్చిన ప్రతి ప్రయాణికుడికి చల్లగాలి తగిలే విధంగా రెండు ఫ్లాట్ ఫారాలకు ఒక కూలర్‌ను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఆహ్లాదకర చల్లటి వాతావరణాన్ని అందిస్తున్నారు.