అర్ధరాత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై దాడి 

అర్ధరాత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై దాడి 

Mla

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ఇంటిపై దాడి జరిగింది. వెల్దండ మండల మాజీ జడ్పీటీసీ సంజీవ్‌ యాదవ్‌ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డినట్లు తెలుస్తోంది. సహకార ఎన్నికల్లో గెలిస్తే వెల్దండ మండల చైర్మన్‌ పదవి ఇస్తానని మాట తప్పడంతో సంజీవ్‌ అనుచరులు ఎమ్మెల్యే ఇంటిపై దాడిచేసినట్లు చెబుతున్నారు. గొడవలో ఎమ్మెల్యే ఇంటి అద్దాలు పగిలాయి. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదర గొట్టారు.

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. సహకార సంఘం చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్వల్ప గాయాలు అయ్యాయి. ఇరు పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, వారిని చెదరగొట్టారు.

సహకార ఎన్నికల్లోనూ అధికార టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలైనా.. టీఆర్‌ఎస్‌ మద్దతుతో బరిలో దిగిన అభ్యర్థులే ఘన విజయం సాధించారు. ఇటీవల మునిసిపల్‌ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేయడం ద్వారా పట్టణప్రాంతాల్లో పట్టును నిరూపించుకున్న గులాబీ పార్టీ.. సహకార ఎన్నికల ఫలితాలతో గ్రామీణ ప్రాంతాలు, రైతుల మద్దతు కూడా తమకే ఉందని చాటింది.

కేవలం రైతులకే పరిమితమైన ఈ ఎన్నికల్లో పూర్తి 91 శాతం మద్దతు టీఆర్‌ఎ్‌సకు లభించడం వెనుక రైతుబంధు, రైతు బీమా పథకాల ప్రభావం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 904 PACSలకు ఎన్నికలు జరగ్గా… 823 చోట్ల టీఆర్‌ఎస్‌ ఆధిపత్యం చాటుకొంది. కాంగ్రెస్‌కు కేవలం 53 PACS లలోనే మెజారిటీ వచ్చింది. బీజేపీ 8 సొసైటీలకే పరిమితమైంది. కాగా 20 PACSలలో చిన్న పార్టీలు, ఇతరులకు స్థానాలు రావడంతో హంగ్‌ ఏర్పడే పరిస్థితి నెలకొంది.