అయోధ్య శ్రీరామ్ ట్రస్ట్ బ్యాంక్ ఎకౌంట్స్ లో డబ్బులు మాయం..!!

  • Published By: nagamani ,Published On : September 10, 2020 / 02:24 PM IST
అయోధ్య శ్రీరామ్ ట్రస్ట్ బ్యాంక్ ఎకౌంట్స్ లో డబ్బులు మాయం..!!

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరుతో లక్నోలోని ఓ బ్యాంక్‌లోని రెండు ఖాతాల్లో డబ్బులు మాయమయ్యాయి. నకిలీ చెక్కులపై గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ చెక్‌తో రూ.9లక్షలు విత్ డ్రా చేశారు. సెప్టెంబర్ 1న బ్యాంకు నుంచి నకిలీ చెక్కులద్వారా రూ2.5 లక్షలు విత్ డ్రా చేశారు. ఆ తరువాత రెండో సారి రెండు రోజుల తరువాత మరో రూ.3.5 లక్షలు విత్ డ్రా చేశారు.



https://10tv.in/honeytrap-gang-records-objectionable-videos-of-rich-people/
ఈక్రమంలో వరుసగా మూడవ సారి కూడా ట్రస్ట్ ఎకౌంట్స్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో దుండగులు చెక్ వేశారు. సెప్టెంబరు 1న రూ. 9.86 లక్షలను తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారి ఈ విషయాన్ని ట్రస్ట్ జనరల్ సెక్రటరీ సంపత్ రాయ్‌ దృష్టికి తెచ్చారు. అయితే తాము ఎవరికీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. వెంటనే ట్రస్ట్ ఖాతాల్లో నుంచి అన్ని రకాల చెల్లింపులను అధికారులు నిలిపివేశారు.


దీనికి సంబంధంచి ట్రస్ట్ సభ్యులు అయోధ్య కొత్వాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చే శారు. అక్రమంగా డబ్బులు విత్ డ్రా చేసినవారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు డబ్బులు విత్ డ్రా చేసినవారిని కనిపెట్టటం కోసం యత్నిస్తున్నారు. ఈ డబ్బులు తీసుకున్న వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు.


దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం నిర్మాణం పనులు వేగంగా ప్రారంభం అయ్యాయి. ఆలయ వ్యవహారాలు చూసుకునేందుకు ఓ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి భక్తుల నుంచి పెద్ద సంఖ్యలో విరాళాలు కూడా వచ్చాయి. అయితే ఈ ఖాతాల నుంచి వరుసగా డబ్బులు మాయం కావడం సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు రూ. 6 లక్షలు విత్ డ్రా చేయటం కలకలం రేపుతోంది.దీంతో ట్రస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ముమ్మరం చేశారు.