సీఎం జగన్ చెప్పేదొకటి..చేసేదొకటి – బాబు

  • Published By: madhu ,Published On : September 4, 2019 / 12:36 PM IST
సీఎం జగన్ చెప్పేదొకటి..చేసేదొకటి – బాబు

ప్రమాణ స్వీకారం రోజున సీఎం జగన్ ఎన్నో ప్రగల్బాలు పలికారని..ఆనాడు జగన్ చెప్పిందొకటి..ఇప్పుడు చేసేదొకటి అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. వివేకా హత్య కేసులో అనేక సందేహాలున్నాయని..సూసైడ్ నోట్‌లో రెండు రకాల చేతి రాతలు ఉన్నాయని అంటున్నారని తెలిపారు. 100 రోజులు గడిచినా వివేకా హత్య కేసును బయటపెట్టలేని జగన్..రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నించారు బాబు.

సెప్టెంబర్ 05వ తేదీ బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో పోలీసులు నిస్సహాయులయ్యారని ఏపీ కేబినట్ మీటింగ్‌లో శాంతిభద్రతల అంశంపై చర్చించరా అంటూ ప్రశ్నించారు. ఆనాడు ఏదో జరిగిందంటూ రావణ పాలన సాగిస్తారా అంటూ ఆరోపించారు. వంద రోజుల్లో 8 మంది టీడీపీ నేతలను పొట్టన పెట్టుకున్నారని..రాష్ట్రానికి మళ్లీ సమన్యాయం జరగాలంటే టీడీపీ వల్లే సాధ్యమని చెప్పారు. అన్నా క్యాంటీన్లకు రూ. 10 కోట్లతో రంగులు మార్చి మూసివేశారని విమర్శించారు.

ఇసుకను హైదరాబాద్, బెంగళూరు రాష్ట్రాలకు తరలిస్తున్నారని, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇసుక మాఫియా డాన్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు బాబు. రాష్ట్రంలో ప్రస్తుతం సిమెంట్ ధరకంటే ఇసుక ధర ఎక్కువన్నారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ బలం అనుకుంటున్నారని..అది బలుపు కాదు..వాపు అని త్వరలోనే తెలుస్తుందని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత రెండు ఎన్నికల్లో గిరిజన ప్రాంతాల్లో దెబ్బతిన్నామని..ఈసారి గిరిజన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నేతలకు సూచించారు బాబు. 
Read More : ఏపీ ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 10 వేలు : సెప్టెంబర్ 10నుంచి దరఖాస్తులు