టీజీ కామెంట్స్‌పై బాబు సీరియస్

  • Edited By: madhu , January 23, 2019 / 10:02 AM IST
టీజీ కామెంట్స్‌పై బాబు సీరియస్

విజయవాడ : టీడీపీ ఎంపీ టీజీ చేసిన కామెంట్స్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ఏంటీ అంటూ ఆయన టీజీకి క్లాస్ తీసుకున్నారు. అసలు టీజీ చేసిన వ్యాఖ్యలు ఏంటీ ? అంతగా బాబు సీరియస్ అయ్యే పరిస్థితి ఎందుకొచ్చింది ? టీడీపీ-జనసేన కలిస్తే తప్పేంటి…అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని జనవరి 23వ తేదీ బుధవారం చెప్పి సంచలనం సృష్టించారు. ఈ విషయం రచ్చ రచ్చ అవుతుండడంతో బాబు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పార్టీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు చేయవద్దని…నేతలు సంయమనం కోల్పోవద్దని బాబు సూచించారు. ఇలాంటి ప్రకటనలతో  అయోమయం సృష్టించవద్దని హెచ్చరించారు.