నమ్మాల్సిన నిజం : మేక తలకాయ తింటే మటాషే

విశాఖ : మేక తలకాయ మాంసం అంటే చాలు మాంస ప్రియులు లొట్టలేసుకుని తింటారు. కానీ ఈ వార్త వింటే మాత్రం ముద్ద గొంతు దిగని పరిస్థితి ఎదురవుతుంది. అసలు మీరు

  • Published By: veegamteam ,Published On : February 7, 2019 / 08:45 AM IST
నమ్మాల్సిన నిజం : మేక తలకాయ తింటే మటాషే

విశాఖ : మేక తలకాయ మాంసం అంటే చాలు మాంస ప్రియులు లొట్టలేసుకుని తింటారు. కానీ ఈ వార్త వింటే మాత్రం ముద్ద గొంతు దిగని పరిస్థితి ఎదురవుతుంది. అసలు మీరు

విశాఖ : మేక తలకాయ మాంసం అంటే చాలు మాంస ప్రియులు లొట్టలేసుకుని తింటారు. కానీ ఈ వార్త వింటే మాత్రం ముద్ద గొంతు దిగని పరిస్థితి ఎదురవుతుంది. అసలు మీరు తింటున్నది ఎలాంటి తలకాయ మాంసమో తెలిస్తే వణికిపోతారు. విశాఖలో వెలుగుచూసిన ఘటన ఒళ్లు గగుర్పొడిచే నిజాలను వెలికితీసింది. విశాఖ రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై ఎటుచూసినా పార్సిల్లే కనిపిస్తున్నాయి. అందులో మేక, పొట్టేళ్ల తలకాయలు ఉన్నాయి. అవి కూడా కుళ్లిపోయిన దశలో. దీంతో పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన దుర్గంధం వ్యాపించి ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకపోతే అలా కుళ్లిపోయిన వాటినే వ్యాపారులు మార్కెట్‌కు తరలించి వినియోగదారులకు అమ్ముతున్నారు. అసలు విషయం తెలియని వినియోగదారులు వాటిని తిని రోగాలబారిన పడుతున్నారు.

 

ఢిల్లీ నుంచి విశాఖకు మేక, పొట్టేళ్ల తలకాయలు, కాళ్లను పెద్దఎత్తున దిగుమతి చేస్తున్నారు. ఢిల్లీలో వీటికి డిమాండే లేదు. దీంతో ఇచ్చినంత పుచ్చుకుని తలకాయ, కాళ్లను వదిలించుకుంటున్నారు అక్కడి వ్యాపారులు. విశాఖ నగరం నుంచి కొందరు వ్యాపారులు వెళ్లి, ఒక్కో తలను రూ.25 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాటిని పార్సిల్‌ చేసి, రైళ్లలో విశాఖకు తీసుకొస్తున్నారు. రవాణా ఆలస్యం కావడం, వాటిని నిల్వచేసేందుకు కనీస చర్యలు తీసుకోకపోవడంతో.. చాలా సార్లు కుళ్లిపోయిన దశలో విశాఖకు చేరుకుంటున్నాయి. ఇలా పాడైపోయిన మేక తలల బస్తాలను రైల్వే స్టేషన్‌ పక్కనే పడేసి వ్యాపారులు చేతులు దులిపేసుకుంటున్నారు.

 

ఇటీవల ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన దక్షిణ్‌ లింక్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ సంఖ్యలో మేక తలకాయలు, కాళ్లతో ఉన్న పార్సిళ్లు వచ్చాయి. వాటిలో కొన్ని పాడైపోవడంతో దిగుమతి చేసుకున్న వ్యాపారులు 8వ నెంబరు ప్లాట్‌ఫామ్‌ సమీపంలోనే వదిలేసి వెళ్లిపోయారు. కాస్త బాగున్న సరుకును మాత్రం విక్రయించేందుకు నగరంలోకి తీసుకెళ్లిపోయారు. దీనిపై పలువురు ప్రయాణికులు రైల్వే అధికారులకు ఫిర్యాదులు చేయడంతో అసలు విషయం బయటికొచ్చింది.

 

విశాఖతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కుళ్లిపోయిన మాంసాన్ని సైతం కాల్చి అమ్మేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సంబంధిత అధికారులు దాడులు చేస్తే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కుళ్లిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నారు అనే ఆరోపణలను స్థానిక వ్యాపారులు ఖండించారు. విశాఖలోని హనుమంత వాక మార్కెట్‌లో విక్రయిస్తున్న మేక తలలు, కాళ్లు లోకల్ వే అంటున్నారు. తమను దెబ్బకొట్టేందుకే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని వాపోతున్నారు. పుకార్ల వల్ల వ్యాపారం దెబ్బతిందని.. రెండురోజులుగా తలలు కొనేవారే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.