ఆ పథకం ప్రభుత్వ మానస పుత్రిక: కలెక్టర్లకు జగన్ ఆదేశం

  • Published By: vamsi ,Published On : November 12, 2019 / 09:27 AM IST
ఆ పథకం ప్రభుత్వ మానస పుత్రిక: కలెక్టర్లకు జగన్ ఆదేశం

ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మనకు మానస పుత్రిక లాంటిది అని అన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ప్రతి జిల్లాలో కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయడానికి కృషిచేయాని ఆదేశించారు జగన్ మోహన్ రెడ్డి. మన పరిపాలన ఎలా ఉందో ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలుస్తుందని అభిప్రాయపడ్డారు జగన్. దేశం మొత్తం ఈ పథకం గురించే మాట్లాడుకుంటుందని కూడా అన్నారు జగన్.

ఈ కార్యక్రమం కోసం ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఒక ఎత్తు అయితే, వచ్చే నాలుగు నెలల్లో మనం చేయాల్సిన ప్రయత్నాలు ఇంకో ఎత్తు అని కలెక్టర్లకు వివరించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, లేని పక్షంలో భూమలు కొనాలని, వాటిని పేదలకు ఇవ్వడంపైనే కలెక్టర్లు ఆలోచించాలని అన్నారు జగన్.

అలాగే నవంబర్‌ 20వ తేదీ నుంచి బియ్యంకార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ, ఫీజురియింబర్స్‌ మెంట్‌ లబ్ధిదారుల ఎంపిక చేసి ఎవరికి ఏ పథకం వర్తింపజేయాలని సూచించారు. అలాగే నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 20వ వరకు కార్డులు జారీ చేసేందుకు గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఎంపిక చేయాలని చెప్పారు జగన్. అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, అమ్మ ఒడి, నాయీ బ్రాహన్మణులకు నగదు, వైఎస్ఆర్ కాపు నేస్తం, గ్రామాల్లోని దేవాలయాలు, చర్చిలు, మసీదులు.. సహా ఇతర పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాలు క్లియర్‌గా ఉండాలని చెప్పారు.

అలాగే గ్రామ సచివాలయంలో పర్మినెంట్‌గా డిస్‌ ప్లే బోర్డులు పెట్టాలని, వివిధ పథకాలకు అర్హులైన వారి జాబితాను అక్కడ ఉంచాలని ఆదేశించారు. అర్హులైన వారు ఎలా దరఖాస్తు చేయాలి? ఎవరికి చేయాలన్న సమాచారం అందులో ఉంచాలని చెప్పారు.