దొంగలతో చేతులు కలిపి రిపోర్టర్,SI దోపిడీలు : Rs.26 లక్షల లూటీలో అడ్డంగా బుక్ అయ్యారు..

  • Published By: nagamani ,Published On : August 25, 2020 / 04:26 PM IST
దొంగలతో చేతులు కలిపి రిపోర్టర్,SI దోపిడీలు : Rs.26 లక్షల లూటీలో అడ్డంగా బుక్ అయ్యారు..

పోలీసు అంటే న్యాయాన్ని కాపాడేవాడు..ప్రజల్న రక్షించేవాడు. జర్నలిస్టు అంటే నిజాల్ని నిర్భయంగా చెప్పేవాడు. కానీ కర్ణాటకలో మాత్రం ఓ పోలీసు, జర్నలిస్టులు ఏకంగా దొంగల ముఠాతో చేతులు కలిపి దోపిడీదారుల్లా తయారయ్యారు. పోలీసులు, జర్నలిస్టులకు చాలా దగ్గరి సంబంధాలు ఉంటాయి. కేసుల దర్యాప్తు విషయాల్లో, ఆధారాల్లో ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుుంటుంటారు. కానీ బెంగుళూరుకు చెందిన ఈ పోలీసు SI, రిపోర్ట్ కలిసి బందిపోటుల్లా తయారయ్యారు. ఓ వ్యక్తి నుంచి చాకచక్యంగా రూ. 26 లక్షలు కాజేశారు. బెంగుళూర్‌లోని చిక్కపేటలో ఆగస్టు 19న జరిగిన ఈ ఘటన వెలుగులోకి రావడంతో వారిద్దరూ కటకటాలపాలయ్యారు.

శివ కుమారస్వామి అనే వ్యక్తి 26.5 లక్షల నగదును తీసుకువస్తున్నాడనే విషయం ఓ ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న ఎస్సై జీవన్ కుమార్ థామస్‌ (31)రిపోర్టర్ జ్ఞానప్రకాష్ అంతోనప్పకు చెప్పాడు. ఆ తరువాత మరో దొంగకు ఫోన్ చేసి వెంటనే చిక్కపేట మెట్రో స్టేషన్ సమీపంలో ఉండమని చెప్పాడు.



అలా తాను కూడా అక్కడికి చేరుకుని..శివకుమార్ చిక్కపేట మెట్రోస్టేషన్ కు వచ్చేదాకా రిపోర్టర్ జ్ఞానప్రకాష్ అంతోనప్ప ఇద్దరూ కలిసి కాపుకాసుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో మెట్రోస్టేషన్ వద్దకు శివకుమార్ చేరుకున్నాడు. తాను డబ్బు అందజేయాల్సిన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలో ఆ వ్యక్తి కూడా రావటంతో తన దగ్గరున్న రూ.25.5 డబ్బును అతనికి ఇస్తుండగా ఇంతలో స్సై జీవన్ కుమార్ థామస్‌ (31)రిపోర్టర్ జ్ఞానప్రకాష్ అంతోనప్ప (44) మరో దొంగ ముగ్గురు కలిసి అమాంతంగా వచ్చి పడ్డారు. శివకుమారస్వామి ఫోను..మరో వ్యాపారి వద్ద ఉన్న ఫోన్లు లాక్కున్నారు. ఇంత డబ్బు ఎక్కడ నుంచి ఎక్కడకు పట్టికెళ్లుతున్నారని దబాయించి..రండి పోలీస్ స్టేషన్ కుఅంటూ అక్కడే సిద్ధంగా ఉంచి కారులోకి వాళ్లను లాగిపడేశారు. ఆ తరువాత వారిని లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్స్ సమీపంలోని ఓ హోటల్ కు తరలించారు. తరువాత వాళ్ల దగ్గరున్న రూ.25.5 లక్షల డబ్బుని కూడా లాక్కుని..ఈ విషయం ఎవరికన్నా చెబితే చంపేస్తాం…అంటూ బెదిరించి డబ్బుతో సహా ఉడాయించారు.



ఈ విషయాన్ని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్సై జీవన్ కుమార్ థామస్ , కన్నడ రిపోర్టర్ జ్ఞానప్రకాష్ ఆంథోనప్ప కలిసి ఈ కుట్ర చేశారని తేలింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.



విచారణలో భాగంగా..తుమాకురు నివాసి కిషోర్‌ అనే వ్యక్తి ఎస్సైకి డబ్బు సమాచారం అందించినట్లుగా తేలిందని బెంగుళూరు వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ సంజీవ్ పాటిల్ తెలిపారు. పరారీలో ఉన్న కిషోర్ కోసం గాలిస్తున్నారు. ఇలా డబ్బుుల తరలిస్తున్నవారి వివరాలను కొంతమంది దొంగలు ఎస్సై జీవన్ కుమార్ థామస్‌ కు సమాచారం ఇస్తుంటారని..వాళ్లతో కలిసి ఎస్సై ఇటువంటి దోపిడీలు చేస్తుంటాడని తేలింది.