పైసా వసూల్ : మాస్కు పెట్టుకోలేదని..కోటి రూపాయలు ఫైన్

  • Published By: nagamani ,Published On : July 15, 2020 / 01:57 PM IST
పైసా వసూల్ : మాస్కు పెట్టుకోలేదని..కోటి రూపాయలు ఫైన్

కరోనా మహమ్మారి మాస్క్ పెట్టుకుంటేనే భద్రం అని చెబుతున్నారు నిపుణులు. కానీ చాలామంది నిర్లక్ష్య చేస్తున్నారు. వారి నిర్లక్ష్యంతో వారికేకాదు..తోటివారికి కూడా కరోనా వచ్చేలా వ్యవహరిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుంటే భారీ జరిమానాలు వేస్తున్న చాలామందిలో మార్పు రావటంలేదు.దీంతో కరోనా నిబంధనల్లో భాగంగా మాస్క్ లేకుండా బయటకు వచ్చే వారిపై జరిమానాలను కూడా విధిస్తు బెంగళూరు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలా కేవలం నెల రోజుల్లో మాస్కులు లేకుండా బైటకొచ్చినవారికి భారీగా జరిమానాలు విధించారు.

అలా 30 రోజుల్లోనే ఏకంగా రూ. కోటి జరిమానా విధించి వసూలు చేశారు. జూన్ 9 నుంచి జులై 10 వరకు మొత్తం రూ. 1.01 కోట్లను వసూలు చేశారు. వీటిలో 46,959 కేసులు మాస్కులు ధరించనందుకు…3 వేల 747 కేసులను సోషల్ డిస్టెన్స్ పాటించనందుకు జరిమానాలు విధించారు. బెంగళూరు పోలీసులు, నగర మున్సిపల్ అధికారులు జాయింట్ టీమ్ గా ఏర్పడి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటు పైసా వసూళ్లు ముమ్మరంగా చేస్తున్నారు.

దీంతో బెంగళూరుకు భారీగా సొమ్ముు కురుస్తున్నాయి. ఇదే కేవలం డబ్బుల కోసం కాదనీ కరోనా నిబంధనల్లోభాగమేనని ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సూచిస్తూ హెచ్చరిస్తున్నారు బెంగళూరు పోలీసులు.