భారత్ సర్జికల్ ఎటాక్ :ట్వీట్లతో నేతల హర్షం 

  • Published By: veegamteam ,Published On : February 26, 2019 / 09:12 AM IST
భారత్ సర్జికల్ ఎటాక్ :ట్వీట్లతో నేతల  హర్షం 

జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడికి భారత్ సర్జికల్ దాడితో దెబ్బకు దెబ్బ తీసిందని పలువురు నేతలు హర్షం వ్యక్తంచేశారు. పాకిస్థాన్ చేసిన దాడికి దాడికి భారత్ బదులు తీర్చుకుంది. పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడితో దెబ్బకు దెబ్బ తీస్తూ..300ల మంది  ముష్కర మూకల్ని అంతం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర శిబిరాలపై భారత్‌ బాంబుల వర్షం కురిపించి శత్రు స్థావరాలను మట్టుబెట్టింది. పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తెల్లవారుజామున మిరాజ్-2000 యుద్ధ విమానాలతో దాడిచేసింది. ఈ దాడుల్లో దాదాపు 300 మంది తీవ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది. 
Also Read : దేశవ్యాప్తంగా హైఅలర్ట్: ఉగ్రదాడులు జరగొచ్చని ఐబీ వార్నింగ్

దాయాది దేశంపై మెరుపు దాడుల్ని యావత్ భారతం స్వాగతిస్తోంది. పార్టీలకు అతీతంగా నేతలంతా వాయుసేనకు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వాయుసేనకు సెల్యూట్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్‌తో పాటూ జాతీయ పార్టీల నేతలు ట్వీట్లు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు..మంత్రి నారా లోకేశ్, తెలంగాణ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, పశ్చిబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింత కేజ్రీవాల్ వంటి పలువురు నేతలు ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించారు.
Also Read :అప్పటి విమానం హైజాక్ తీవ్రవాది.. ఈ దాడుల్లో చచ్చాడు

Also Read : అర్థరాత్రి యుద్ధం : పాక్ విమానాలు వెంటాడినా.. భారత్ పైటర్లు చిక్కలేదా!