భీమిలీ బీచ్‌లో లోకేశ్ కిడ్నాప్..చిత్రహింసలు పెట్టిన కిడ్నాపర్లు..పరిస్థితి విషమం

  • Published By: veegamteam ,Published On : February 13, 2020 / 07:17 AM IST
భీమిలీ బీచ్‌లో లోకేశ్ కిడ్నాప్..చిత్రహింసలు పెట్టిన కిడ్నాపర్లు..పరిస్థితి విషమం

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. విశాఖపట్నం భీమిలీ బీచ్ లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన లోకేష్ కిడ్నాప్ కు గురయ్యాడు. లోకేశ్ ను కిడ్నాపర్లు చిత్రహింసలు పెట్టారు. వారి తల్లి వరలక్ష్మికి ఫోన్ చేసిన ఫోన్ చేసి రూ.35 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో భయపడిని లోకేశ్ తల్లి వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలిసిన కిడ్నాపర్లు భయపడ్డారు.

వెంటనే లోకేశ్ ను భీమవరంలోని పద్మాలయ థియేటర్ సమీపంలో వదిలేసి పరారయ్యారు. కిడ్నాపర్ల  చేతిలో చిత్రహింసలకు గురైన లోకేశ్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. లోకేశ్ కు తీవ్ర గాయాలు కావటంతో అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. కాగా కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.  

వివ‌రాల్లోకి వెళితే.. భీమ‌వ‌రం కు చెందిన లోకేష్‌కు క్రికెట్ బెట్టింగ్ అల‌వాటు ఉంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు వ్య‌క్తుల లోకేష్‌ని కిడ్నాప్ చేసారు. తరువాత అతన్ని వాహనంలో తిప్పుతూ విశాఖ జిల్లా భీమిలో చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారు. అక్కడి నుంచే కిడ్నాప‌ర్లు లోకేశ్ తల్లి వరలక్ష్మి  ఫోన్ చేసారు… లోకేష్ ప్రాణాలతో విడిచిపెట్టాలంటే రూ.35 ల‌క్ష‌లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 

తాము అంత డ‌బ్బు ఇచ్చుకోలేమ‌ని చెప్పిన తల్లిదండ్రులు రెండు ల‌క్ష‌లు ఇస్తామ‌ని… మా కొడుకును విడిచిపెట్టండీ..అంటూ వేడుకున్నారు. అయినా కిడ్నాప‌ర్లు రూ.35 ల‌క్ష‌లు ఇస్తేనే వదులుతామని అన్నారు.  అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌క‌పోతే….మీ కొడుకు మీకు ద‌క్క‌డంటూ బెదిరించారు. దీంతో భయపడిపోయిన లోకేష్ తల్లిదండ్రులు భ‌యాందోళ‌న‌లు చెంది పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.

దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు లేటెస్ట్ టెక్నాల‌జీని వినియోగించారు. పోలీస్ యాప్ ద్వారా… లోకేష్ ఉన్న లొకేషన్ ను తెలుసుకునే యత్నం చేసారు. అయితే ఆ విష‌యాన్ని తెలుసుకున్న కిడ్నాప‌ర్లు లోకేష్ ను రెండు రోజుల క్రిత‌మే భీమ‌వ‌రంకు తీసుకు వ‌చ్చి వ‌దిలేసి పరారయ్యారు. లోకేష్ ను వ‌దిలి వెళ్లార‌న్న స‌మాచారాన్ని తెలుసుకుని ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని శ‌రీరం నిండా గాయాల‌తో ఉన్న కొడుకుని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.

తరువాత కిడ్నాపర్లు లోకేశ్ ను విడిచిపెట్టారని పోలీసులకు తెలిపారు. కాగా..ఈ కిడ్నాప్ ఎందుకు జరిగింది. క్రికెట్ బెట్టింగ్ కారణమా? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న కిడ్నాపర్స్ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కొంతమంది అనుమానితుల‌ను అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం. 

 

Click Here: కరోనా వైరస్ ఎఫెక్ట్: వాటికి పెరిగిన డిమాండ్