కోడెల కుటుంబానికి బిగ్ షాక్

  • Published By: veegamteam ,Published On : August 29, 2019 / 02:51 PM IST
కోడెల కుటుంబానికి బిగ్ షాక్

టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబానికి ఆర్టీఏ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. కోడెల కుమారుడు శివరామకృష్ణకి చెందిన హీరో షోరూమ్ డీలర్ షిప్ ని రద్దు చేశారు. గౌతం ఆటోమోటివ్స్ లైసెన్స్ కూడా రద్దు చేశారు. గౌతం ఆటోమోటివ్స్ కి వాహనాల సరఫరా నిలిచేలా డీలర్ షిప్ రద్దు చేశారు. పన్ను ఎగవేత, అవకతవకల ఆరోపణలపై విచారణ జరిపిన రవాణశాఖ అధికారులు.. నిజమే అని తేల్చారు. ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్ ని ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఆర్టీఏ చట్టాలను ఉల్లంఘించి 576 వాహనాలను అక్రమంగా కొనుగోలుదారులకు అమ్మారని ఆర్టీఏ అధికారుల విచారణలో తేలింది. Rule 84, APMV Rules 1989 అనుసరించి కోడెల శివరామకృష్ణకి చెందిన గౌతం ఆటోమోటివ్ డీలర్ షిప్ ని క్యాన్సిల్ చేస్తున్నటు వివరించారు.

గౌతం హీరో షోరూమ్ పై మరో వివాదమూ ఉంది. అసెంబ్లీ ఫర్నీచర్ ని కోడెల హీరో షో రూమ్ కి తరలించారు. గుంటూరు చుట్టుగుంటలోని కోడెల కుమారుడికి చెందిన గౌతమ్‌ హీరో షోరూంలో అసెంబ్లీ అధికారులు జరిపిన తనిఖీల్లో ఫర్నీచర్‌ను గుర్తించారు. 70 వస్తువులు ఉన్నాయి. అసెంబ్లీ అధికారులు ఇచ్చిన జాబితా కంటే ఎక్కువ ఫర్నీచర్‌ ని కోడెల తరలించినట్లు చెప్పారు. ఇప్పటికే కోడెల శివప్రసాదరావు ఆయన కుమారుడు కోడెల శివరాంపై సెక్షన్ 409, 411 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.