శేషాచలంలో షేర్ ఖాన్ : తిరుమలలో ఇదే ఫస్ట్ టైమ్

కలియుగ వైకుంఠ దైవం వేంకటేశ్వరుడు కొలువుదీరిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో పెద్ద పులి కలకలం రేపింది. తిరుమల అడవుల్లో పెద్ద పులి కనిపించింది. తిరుమల అడవుల్లో పులి

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 04:02 PM IST
శేషాచలంలో షేర్ ఖాన్ : తిరుమలలో ఇదే ఫస్ట్ టైమ్

కలియుగ వైకుంఠ దైవం వేంకటేశ్వరుడు కొలువుదీరిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో పెద్ద పులి కలకలం రేపింది. తిరుమల అడవుల్లో పెద్ద పులి కనిపించింది. తిరుమల అడవుల్లో పులి

కలియుగ వైకుంఠ దైవం వేంకటేశ్వరుడు కొలువుదీరిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో పెద్ద పులి కలకలం రేపింది. తిరుమల అడవుల్లో పెద్ద పులి కనిపించింది. తిరుమల అడవుల్లో పులి కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్. గోగర్భం డ్యామ్ దగ్గర చెక్ పోస్టు సమీపంలో పెద్దపులి రోడ్డు దాటుతూ కనిపించింది. అక్కడే ఉన్న కొందరు భక్తులు పులి ఫొటోలు తీశారు. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అయ్యాయి.

తిరుమల అడవుల్లో పెద్ద పులి సంచారం ఉన్నట్టు ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ ఇంతవరకు ప్రత్యక్షంగా కనిపించింది లేదు. కాగా, గురువారం(నవంబర్ 21,2019) సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో పాపవినాశనం రహదారిలోని గోగర్భం డ్యామ్ దగ్గర చెక్ పోస్టుకి సమీపంలో రోడ్డుదాటుటూ పెద్దపులి కనిపించింది. ఇది గమనించిన కొందరు భక్తులు వెంటనే తమ ఫోన్లు తీసి ఫొటోలు తీశారు. ఆ ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.

శ్రీశైలం అడవుల్లో పెద్దపులుల సంచారం ఉంది. కానీ తిరుమల శేషాచలం అడవుల్లో పెద్దపులుల సంచారం ఇంతవరకు లేదు. శేషాచలం అడవుల్లో చిరుత పులులు, ఇతర జంతువులు ఉన్నాయి. కానీ పెద్దపులి కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్. ఇది సంచలనంగా మారింది. తిరుమల అడవుల్లో పెద్దపులి జాతి అంతరించిపోయింది అనుకుంటున్న తరుణంలో.. పెద్దపులి ప్రత్యక్షం కావడం కలకలం రేపింది.