Bin Laden: ప్రిన్స్ ఛార్లెస్ ఛారిటీకి బిన్ లాడెన్ కుటుంబం భారీ విరాళం.. బ‌య‌ట‌పెట్టిన ‘సండే టైమ్స్’

స‌ల‌హాదారులు వ‌ద్ద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ బిన్ లాడెన్ సోద‌రులు బకర్ బిన్ లాడెన్‌, షఫీక్‌ నుంచి ప్రిన్స్ ఛార్లెస్ విరాళం తీసుకున్నారు. 2013లో లండ‌న్‌లోని బ్రిటిష్ రాజ నివాసం క్లారెన్స్ హౌస్‌లో చార్లెస్‌ను బకర్ బిన్ లాడెన్ (76) క‌లిశారు. ఆ స‌మ‌యంలోనే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఛారిటేబుల్ ఫండ్ (పీడ‌బ్ల్యూసీఎఫ్‌)కు బ‌క‌ర్ విరాళం ఇస్తాన‌ని చెప్ప‌గా, చార్లెస్ అంగీక‌రించారు. ఆ విరాళాన్ని తీసుకోవ‌ద్ద‌ని ఆ స‌మ‌యంలో స‌ల‌హాదారులు చేసిన సూచ‌న‌ల‌ను చార్లెస్ వినిపించుకోలేదు.

Bin Laden: ప్రిన్స్ ఛార్లెస్ ఛారిటీకి బిన్ లాడెన్ కుటుంబం భారీ విరాళం.. బ‌య‌ట‌పెట్టిన ‘సండే టైమ్స్’

Charles

Bin Laden: అమెరికాలో 9/11 ( ట్విన్ టవర్లపై దాడి) ఘటనలో ప్రధాన సూత్రధారి బిన్ లాడెన్ కుటుంబం నుంచి బ్రిటిష్ రాజవంశానికి చెందిన ప్రిన్స్ చార్లెస్ (73) గతంలో రూ.9.64 కోట్లు విరాళం తీసుకున్నట్లు సండే టైమ్స్ తాజాగా ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. దీంతో, బిన్ లాడెన్ కుటుంబ స‌భ్యులు నేరాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఎలాంటి ఆరోప‌ణ‌లూ లేక‌పోయిన‌ప్ప‌టికీ ప్రిన్స్ చార్లెస్ ఛారిటీ సంస్థ తీసుకుంటోన్న విరాళాల విష‌యంలో ఎన్నో సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఆ ఛారిటీ సంస్థ‌పై ప‌లు నేర‌పూరిత ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

సండే టైమ్స్ పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం.. స‌ల‌హాదారులు వ‌ద్ద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ బిన్ లాడెన్ సోద‌రులు బకర్ బిన్ లాడెన్‌, షఫీక్‌ నుంచి ప్రిన్స్ ఛార్లెస్ విరాళం తీసుకున్నారు. 2013లో లండ‌న్‌లోని బ్రిటిష్ రాజ నివాసం క్లారెన్స్ హౌస్‌లో చార్లెస్‌ను బకర్ బిన్ లాడెన్ (76) క‌లిశారు. ఆ స‌మ‌యంలోనే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఛారిటేబుల్ ఫండ్ (పీడ‌బ్ల్యూసీఎఫ్‌)కు బ‌క‌ర్ విరాళం ఇస్తాన‌ని చెప్ప‌గా, చార్లెస్ అంగీక‌రించారు. ఆ విరాళాన్ని తీసుకోవ‌ద్ద‌ని ఆ స‌మ‌యంలో స‌ల‌హాదారులు చేసిన సూచ‌న‌ల‌ను చార్లెస్ వినిపించుకోలేదు.

అప్ప‌ట్లో ట్రస్టులోని ఐదుగురు స‌భ్యులు కూడా ఆ విరాళాన్ని అంగీక‌రించార‌ని పీడ‌బ్ల్యూసీఎఫ్ చైర్మ‌న్ చెషైర్ తెలిపారు. మ‌రోవైపు, చార్లెస్ ఛారిటేబుల్ ఫౌండేష‌న్స్‌కు చెందిన మ‌రో సంస్థ‌కు సౌదీ వ్యాపారవేత్త మహ్ ​ఫౌజ్​ ముబారక్​ నగదు చెల్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. చార్లెస్‌కు ప్ర‌యోజ‌నాలు చేకూరేలా ఈ వ్య‌వ‌హారం జ‌రిగింది. మహ్ ​ఫౌజ్​ ముబారక్​ మాత్రం ఆ ఆరోప‌ణ‌ల‌ను ప‌లుసార్లు కొట్టిపారేశారు. దీనిపై ఫిబ్రవరిలోనే బ్రిటిష్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ట్ర‌స్టుపై ఆరోప‌ణలు రావ‌డంతో గ‌త ఏడాది ప్రిన్స్ ఫౌండేష‌న్ చీఫ్ రాజీనామా కూడా చేశారు. ప్రిన్స్ ఫౌండేష‌న్‌ను 1986లో స్థాపించారు.

China: అంద‌రినీ భ‌య‌పెట్టిన త‌మ‌ రాకెట్ శ‌కలాలు ఎక్క‌డ ప‌డ్డాయో తెలిపిన చైనా