శ్రీశైలం రేసులో.. తెలుగుదేశంలోకి బైరెడ్డి

శ్రీశైలం రేసులో.. తెలుగుదేశంలోకి బైరెడ్డి

శ్రీశైలం రేసులో.. తెలుగుదేశంలోకి బైరెడ్డి

రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో సొంత ఉనికిని చాటుకునేందుకు టీడీపీని వీడిన నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగువెలిగిన బైరెడ్డి రాయలసీమ పరిరక్షణ సమితి ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని మొద‌లుపెట్టారు. అనంతరం పరిణామాలలో బైరెడ్డి  రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఇటీవల కాంగ్రెస్‌తో విభేదించిన బైరెడ్డి ఇప్పుడు మళ్లీ తన సొంత గూడైన తెలుగుదేశంకు వచ్చే యోచనలో ఉన్నారు. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీల్లో  అభ్యర్థులు దాదాపు ఖరారు చేయడంతో బైరెడ్డి టీడీపీలో చేరరనే వార్తలు వచ్చాయి.
Read Also : వైసీపీ నుంచి టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే

అయితే ఇటీవల తెలుగుదేశం శ్రీశైలం తెలుగుదేశం అభ్యర్ధిగా బుడ్డా రాజశేఖర్ రెడ్డిని నిలబెట్టగా.. ఆయన రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ స్థానానికి తెలుగుదేశం తరుపున పోటీ చేసేందుకు  బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.  కొద్దికాలం క్రితం చంద్రబాబుపై కామెంట్లు చేసిన బైరెడ్డి.. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు టీడీపీతో పొత్తు వద్దు అంటూ వాదించాడు. ఈ క్రమంలో చంద్రబాబు నిర్ణయం కోసం బైరెడ్డి ఎదురుచూస్తున్నారు. టికెట్ హామీ దొరికితే ఇవాళ(19 మార్చి 2019) సీఎం చంద్రబాబు సమక్షంలో బైరెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉంది.

×