దేశంలో తొలిసారిగా..ముంబై ట్రాఫిక్ సిగ్నల్స్ లో జెండర్ ఈక్వాలిటీ

  • Published By: nagamani ,Published On : August 9, 2020 / 03:46 PM IST
దేశంలో తొలిసారిగా..ముంబై ట్రాఫిక్ సిగ్నల్స్ లో జెండర్ ఈక్వాలిటీ

దేశంలో తొలిసారిగా..ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్‌లో లింగ సమానత్వాన్ని (జండర్ ఈక్వాలిటీ) పాటించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ట్రాఫిక్స్ సిగ్నల్స్‌లో మనుషులు నడిచేందుకు సూచించే గ్రీన్, రెడ్ సిగ్నల్స్‌లో పురుషుల సింబల్స్ మాత్రమే ఉండేవి. కానీ బుంబైలోని ‘జి నార్త్’ వార్డులోని పలు చౌరస్తాల్లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ పై మహిళ బొమ్మలను ఏర్పాటు చేశారు. దాదర్, మహిమ్ మధ్య ఉన్న 4.5 కిలోమీటర్ల మేర ఇలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్ నెలకొల్పారు.

లింగ సమానత్వం కోసం..దాని ఆవశ్యకతను సాటి చెప్పటం కోసం..దీని కోసం తీసుకున్న చొరవలో భాగంగా..ట్రాఫిక్ సిగ్నల్ సిగ్నేజ్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని..నగరంలోని జి నార్త్ వార్డ్‌లోని కాడెల్ రోడ్ అని పిలువబడే వీర్ సావర్కర్ మార్గ్‌లోని 13 జంక్షన్లలో ఈ జెంటర్ ఈక్వాలిటీ లైట్ సిగ్నల్ ఏర్పాటు చేశామని జి నార్త్ వార్డ్ అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ కిరణ్ దిఘవ్కర్ తెలిపారు. దాదర్, మహిమ్ మధ్య ఉన్న 4.5 కిలోమీటర్ల మేర ఇలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్ నెలకొల్పామని తెలిపారు.

జర్మనీలోని పలు నగరాల్లో మహిళల సింబల్స్ ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయని, దేశంలో ఇలాంటివి ఏర్పాటు చేయడం ముంబైలోనే తొలిసారని బీఎంసీ అదనపు కమిషనర్ కిరణ్ తెలిపారు. వీటి కోసం పోలీస్ శాఖ నుంచి ప్రత్యేక అనుమతి పొందామని, కొత్త ట్రాఫిక్స్ సిగ్నల్స్ తయారీకి రూ. లక్ష ఖర్చయ్యిందని తెలిపారు. కాగా, బీఎంసీ అధికారులు చేపట్టిన ఈ చొరవ లింగ సమానత్వం, మహిళా సాధికారితను పెంచేందుకు దోహదపడుతుందని ..పలువురు అభిప్రాయపడుతున్నారు.