గోదావరిలో బోటు ప్రమాదం : హెలికాప్టర్లతో సహాయక చర్యలు

  • Published By: veegamteam ,Published On : September 15, 2019 / 11:13 AM IST
గోదావరిలో బోటు ప్రమాదం : హెలికాప్టర్లతో సహాయక చర్యలు

తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాదం జరిగింది. గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగి పోయింది. మృతుల సంఖ్య ఏడుకు చేరింది. 24 మందిని రక్షించారు. బోటులో మొత్తం 61 మంది ప్రయాణికులు ఉన్నారు. సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది.  సహాయక చర్యల కోసం రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ను ఘటనాస్థలికి పంపారు. నీటి ఉధృతి, సహాయక చర్యలపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. 140 మందితో కూడిన. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను ఘటనాస్థలికి పంపారు. 

పాపికొండలకు వెళ్తుండగా దేవీ పట్నం మండలం కచ్చులూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పర్యాటకుల బోటుకు అనుమతి లేదని అధికారులు అంటున్నారు. రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి, సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

రాయల్ వవిష్ట బోటు ఎలాంటి అనుమతులు లేకుండానే నడుస్తోంది. ప్రైవేట్ ఆపరేటర్లు పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంత వరదలో అనుమతిలేని బోట్లు నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు మొద్దునిద్ర వీడడం  లేదు.

Also Read : బోటు ప్రమాదం : మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా