స్నేహితురాలి గర్భం కోసి శిశువును అపహరించిన మహిళ

  • Published By: nagamani ,Published On : September 5, 2020 / 12:53 PM IST
స్నేహితురాలి గర్భం కోసి శిశువును అపహరించిన మహిళ

ప్రాణస్నేహితురాలి పట్ల సాటి మహిళ అత్యంత దారుణమైన ఘాతుకానికి పాల్పడింది. ఎవరన్నా..డబ్బులు..నగలు..క్రెడిట్ కార్డులు దొంగలిస్తారు.కానీ..నిండు గర్భంతో ఉన్న స్నేహితురాలిపై కత్తితో దాడి చేసిన ఆ గర్భాన్ని కోసి..కడుపులో ఉండే శిశువుని ఎత్తుకుపోయింది…!! ఈ అత్యంత దారుణమైన ఘటన బ్రెజిల్ లో జరిగింది. వింటేనే ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటనలో స్నేహితురాలు అనే మాటకే మాయని మచ్చని తీసుకొచ్చిందామె..



ఈ దారుణ ఘటనకు వివరాలల్లోకి వెళితే..సాంటా కాటెరినా రాష్ట్రం కానెలిన్హా నగరంలో ఫ్లావియా గోడిన్హో మాఫ్రా అనే 24 ఏళ్ల యువతి గర్భంతో ఉంది. నిండు గర్భంతో ఉన్న ఆమె కొన్ని రోజులకు ఓ పాపాయి నా ఒడిలోకి వస్తుందని పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కంటోంది. మాఫ్రాకు ఓ స్నేహితురాలు ఉంది. మాఫ్రా స్నేహితురాలికి కొన్ని నెలల క్రితం అబార్షన్ అయ్యింది. కానీ ఆమె మరో బిడ్డకోసం ప్రయత్నించవచ్చు. కానీ తనకు గర్భస్రావం అయ్యింది. ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. గర్భం ఉన్నట్లుగానే అందరినీ నమ్మించింది. కానీ..తన స్నేహితురాలు మాత్రం గర్భంతోనే ఉంది. ఆరోగ్యంగా ఉంది. కొన్ని రోజుల్లో ఆమెకు బిడ్డకూడా పుడుతుంది అనే విషయాన్ని ఆమె భరించలేకపోయింది. దీంతో స్నేహితురాలిపై ఈర్ష్య అసూయా ద్వేషాలు నింపుకుంది. ఎలాగైనా ఆమెకు బిడ్డ పుట్టకూడదు..ఆ బిడ్డ నాకే కావాలని దుర్మార్ఘపు ఆలోచనలు చేసింది.
https://10tv.in/16-year-old-girl-gangraped-by-teens-obscene-act-recorded-on-phones-at-ludhiana/

మాఫ్రాపై ఆమె విషపు చూపు పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి.. తన వద్దకు రప్పించుకుంది. ఆ తర్వాత తన భర్తతో కలిసి ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారంగా..మాఫ్రాను ఇటుకలతో కొట్టి చంపేసింది. తరువాత ఓ పదునైన కత్తితో మాఫ్రా కడుపును కోసి.. గర్భంలో ఉన్న నవజాత శిశువును దొంగిలించింది. అమ్మకడుపులో హాయిగా..ఏమాత్రం భయంలేకుండా పెరుగుతున్న ఆపసిగుడ్డు దుర్గార్గులకు చిక్కింది. ఆ తర్వాత మాఫ్రా శవాన్ని ఆమె ఇంటికి సమీపంలోని ఓ యార్డులో పడేసి భార్యాభర్తలు పారిపోయారు.ఆ బిడ్డను తీసుకుని ఓ హాస్పిటల్ కు వెళ్లారు. శిశువు వెనుక భాగంలో గాయాలు ఉండటం..ఆ బిడ్డ కొన్ని గంటల క్రితమే పుట్టినట్లుగా ఉంటంతో డాక్టర్లకు అనుమానం వచ్చింది. ఈ బిడ్డ ఎవరిదని..అసలు బిడ్డ తల్లి ఏది అంటూ ప్రశ్నించారు.



మరోపక్క..గురువారం (సెప్టెంబర్ 7,2020) సావో జోనో బాటిస్టాలో జరిగే బేబీ షవర్ కోసం వెళ్లిన భార్య మిస్ అవ్వటంతో మాఫ్రా భర్త…ఆమె స్నేహితులకు ఫోన్ చేసి కనుక్కున్నాడు..తమ దగ్గరకు మాఫ్రా రాలేదని..ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పటంతో కంగారుపడిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటిరోజు మాఫ్రా మృతదేహం యార్డులో లభ్యమైంది.ఆమె కడుపు కోసి ఉండటంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తంచేశారు..ఈ దిశగా దర్యాప్తు చేపట్టగా..మాఫ్రా స్నేహితురాలికి గత జనవరిలో అబార్షన్ అయినట్లు తెలుసుకున్నారు. కానీ ఆమె గర్భంతోనే ఉన్నట్లుగా అందరినీ ఎందుకు నమ్మిస్తోంది అనే విషయంలో దర్యాప్తు కొనసాగించగా..మాఫ్రా కడుపు కోసి ఉండటం..ఆమెకు అబార్షన్ అయి ఉండటం వంటిపలుకీలక అనుమానాలను క్రోడీకరించుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బైటపడింది. మాఫ్రాను ఆమె స్నేహితురాలే హతమార్చిందని..రూఢీ చేసుకున్నారు.

దానికి తోడు ఓ హాస్పిటల్ కు ఇద్దరు వ్యక్తులు బిడ్డ అనుమానాస్పదంగా గాయాలతో తీసుకురావటం వంటి ఘటనతో..మాఫ్రా స్నేహితురాలిని…ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాన్ని ఒప్పుకున్నారు..తనకు జనవరిలో గర్భస్రావం అయిందని, శిశువును దొంగిలించేందుకే మాఫ్రాను చంపేశానని నిందితురాలు పోలీసులకు చెప్పింది. దీంతో వారిద్దని రిమాండ్ కు తరలించి..స్వల్ప గాయాలతో ఉన్న నవజాత శిశువును కూడా స్వాధీనం చేసుకుని చిల్డ్రన్స్ హాస్పిటల్ లో చికిత్సనందిస్తున్నారు.



కాగా 2015లో అమెరికాలో కొలరాడో ప్రాంతంలో ఇటువంటి ఘటనే జరిగింది. గర్భిణిని అత్యంత పాశవికంగా హత్య చేసి..గర్భంలో ఉన్న శిశువును దొంగిలించిన కేసులో ఓ మహిళకు 100 సంవత్సరాల జైలుశిక్ష విధించబడింది.