పెళ్లి కూతురు సడెన్ ట్విస్ట్: ఫ్రెండొచ్చాడు.. పెళ్ళి ఆపేయండి 

  • Published By: veegamteam ,Published On : February 29, 2020 / 06:19 AM IST
పెళ్లి కూతురు సడెన్ ట్విస్ట్: ఫ్రెండొచ్చాడు.. పెళ్ళి ఆపేయండి 

సినిమాల్లో పెళ్లి మండపంలో పెళ్లి సీన్ జరుగుతుంటుంది. సడెన్ గా ఓ కేక వినిపిస్తుంది. ఆపండీ..అంటూ. అది పెళ్లి ఆపటానికి వచ్చినవాళ్లు అనే మాట. కానీ కాసేపట్లో తాళి మెడలో పడుతుంది అనగా పెళ్లికూతురు సడెన్ గా ‘‘ఆపండీ..నాకీ పెళ్లి వద్దు’’అంటూ అరిచింది. పీటల మీద నుంచి లేచిపోయింది. 

వివరాల్లోకి వెళితే..వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని ఓ గ్రామంలో పెళ్లి మండపంలో అత్యంత ఆర్భాటం పెళ్లి తంతు జరుగుతోంది. మహారాష్ట్రలోని షోలాపూర్లో స్థిరపడిన కుటుంబంలోని అమ్మాయికీ..కొత్తకోట మండలంలో నివసిస్తున్న ఓ కుటుంబంలోని అబ్బాయికి శుక్రవారం (ఫిబ్రవరి,28,2020) ఉదయం 8.10 గంటలకు పెళ్లి జరుగుతోంది. పీటలపై పెళ్లి కూతురు…పెళ్లి కొడుకు కూర్చున్నారు. కాసేపట్లో మాంగళ్యధారణ కూడా జరగబోతోంది. 

సరిగ్గా అదే సమయానికి షోలాపూర్ నుంచి పెళ్లికూతురు స్నేహితుడు పెళ్లికి వచ్చాడు. పెళ్లి పీటలపై కూర్చున్న పెళ్లికూతురు అతణ్ని చూసింది. అంతే ఒక్కసారిగా పీటల మీదనుంచి లేచిపోయింది. ‘‘ఆపండీ..నాకీ పెళ్లి ఇష్టంలేదు..చేసుకోను అని తెగేసి చెప్పేసింది. అది విన్న ఇరువర్గాల వారు నివ్వెరపోయారు. ఏం జరుగుతోందో..పెళ్లికూతురు అరిచిన అరుపు నిజమేనా..లేక తమ భ్రమా అనుకుంటూ ఆశ్చర్యపోయారు. 

తరువాత విషయం తెలుసుకున్నారు. దీంతో ఇరు వర్గాలు పెళ్లికూతురు స్నేహితుడిపై విరుచుకుపడ్డారు. దాడికి యత్నించారు. దీంతో భయపడిపోయిన సదరు స్నేహితుడిపారిపోయారు. ఈ హంగామాతో పెళ్లికాస్తా ఆగిపోయింది. 

Also Read |  మార్కుల దానం: ఆన్సర్ పేపర్‌లో స్టూడెంట్ రిక్వెస్ట్.. టీచర్ ఫిదా!