ఈ వారమే ఫైజర్ వ్యాక్సిన్.. అంతా రెడీ.. ఫస్ట్ డోస్ ఎవరెవరికి?

  • Published By: sreehari ,Published On : December 6, 2020 / 08:07 AM IST
ఈ వారమే ఫైజర్ వ్యాక్సిన్.. అంతా రెడీ.. ఫస్ట్ డోస్ ఎవరెవరికి?

Pfizer’s COVID-19 vaccine this week: ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు బ్రిటన్ సన్నాహాలు చేస్తోంది. ఈ వారంలో ఫైజర్ /బయోఎంటెక్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన తొలిదశంగా బ్రిటన్ అవతరించనుంది.



వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా వైద్యుల క్లినిక్‌లకు స్టాక్స్ పంపిణీకి ముందుగా ఆస్పత్రుల్లో షాట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. 80 ఏళ్లు పైబడిన వారికి, ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్లు, కేర్ హోమ్ సిబ్బంది నివాసితులకు అధిక ప్రాధాన్యతతో వ్యాక్సిన్ వేయనుంది. నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ఆధ్వర్యంలో మొదటి మోతాదులను మంగళవారం నిర్వహించనున్నారు.

గత వారం ఫైజర్/బయోఎంటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కోసం బ్రిటన్ అత్యవసర వినియోగ అనుమతి లభించింది.  ప్రపంచ రేసులో అత్యంత కీలకమైన మాస్ ఇనాక్యులేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. బ్రిటన్ 40 మిలియన్ మోతాదులను ఆదేశించింది.



67 మిలియన్ల జనాభా గల దేశంలో 20 మిలియన్ల మందికి టీకాలు వేయడానికి ఈ మోతాదు సరిపోతుంది. మొదటి వారంలోనే సుమారు 8లక్షల మోతాదులు ఇవ్వనున్నారు. బెల్జియం నుంచి వచ్చిన ప్రారంభ మోతాదులను దేశవ్యాప్తంగా సురక్షితమైన ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నామని అక్కడ నాణ్యతను తనిఖీ చేస్తామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.



ఫైజర్ / బయోఎంటెక్ వ్యాక్సిన్‌కు అధిక స్థాయిలో స్టోరేజీ అవసరాలు ఉన్నాయి. -70 C (-94F) వద్ద ఉంచాల్సిన అవసరం ఉంది. సాధారణ ఫ్రిజ్‌లో 5 రోజులు మాత్రమే ఉంటుంది. మొదట 50 ఆస్పత్రుల్లో టీకా ఇవ్వనున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.



ప్రతి టీకాను డీఫ్రాస్ట్ చేసి వినియోగానికి రెడీ చేసేందుకు కొన్ని గంటలు పడుతుందని పేర్కొంది.  డిసెంబర్ 14 నుంచి స్థానిక వైద్యుల సేవల ద్వారా టీకాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉండమని తెలిపింది. స్థానిక వైద్యుల బృందాలు దేశవ్యాప్తంగా 1,000కి పైగా వ్యాక్సిన్ సెంటర్లను నిర్వహిస్తాయని బ్రిటన్ తెలిపింది.