క్లాస్ రూంలో యాసిడ్ బాటిల్స్ : విద్యార్ధులకు గాయాలు  

  • Published By: veegamteam ,Published On : January 29, 2019 / 04:23 AM IST
క్లాస్ రూంలో యాసిడ్ బాటిల్స్ : విద్యార్ధులకు గాయాలు  

తిరుపతి : టీచర్స్ నిర్లక్ష్యానికి చిన్నారులు కాలిన గాయాలతో ఆసుపత్రిలో అల్లాడిపోతున్నారు.క్లాస్ రూమ్ లో యాసిడ్ బాటిల్స్ పగిలిపోవటంతో ఆరుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి రూరల్ మండలం చెర్లోల్లిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. చెర్లోల్లి ప్రభుత్వం స్కూల్ లో 8వ క్లాస్ రూమ్‌లో ప్రమాదవశాత్తూ యాసిడ్ పడి పగిలిపోయాయు. ఈ ప్రమాదంలో  పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలవ్వగా..మరో ఆరుగురు విద్యార్ధులకు యాసిడ్ మీద పడి చర్మం తీవ్రంగా కాలిపోయింది. విద్యార్థులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన విద్యార్ధుల తల్లిదండ్రులు  టీచర్ల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు..చదువుకోవటానికని వచ్చిన బిడ్డలకు చర్మం కాలిపోయి ఆసుపత్రిలోపడి ఉండటం చూసినవారు తీవ్రంగా విలపిస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్న క్లాస్ లో యాసిడ్ బాటిల్స్ తో ప్రయోగం చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోని టీచర్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

స్పెషల్ క్లాస్ అంటూ విద్యార్ధులను టీచర్స్ డిజిటల్ క్లాస్ రూమ్‌కి పంపారని..విద్యార్థులను అక్కడే వదిలేసి టీచర్స్ మాత్రం పత్తా లేకుండా పోయారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను టీచర్స్ ఖండిస్తున్నారు.సైన్స్ లెసన్స్ సందర్భంగా ప్రయోగం చేస్తున్న క్రమంలోనే పాఠాలు చెబుతుండగా.. ప్రమాదవశాత్తూ హెచ్‌సీఎల్ యాసిడ్ పడిందని తెలిపారు. ఈ ఘటనలో వంశీ, దినేశ్‌, తరుణ్‌, శివ, విక్రమ్‌ కృష్ణ అనే విద్యార్థులకు గాయాలైనట్లు వెల్లడించారు. వీరిని చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది.  ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.