మరోసారి పడగ విప్పిన కాల్ మనీ : పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యాయత్నం

  • Edited By: vamsi , December 15, 2019 / 07:32 AM IST
మరోసారి పడగ విప్పిన కాల్ మనీ : పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యాయత్నం

మూడేళ్ల కిందట ఏపీని వణికించిన కాల్ మనీ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. విజయవాడ కేంద్రంగా కాల్ మనీ వ్యవహారం జరిగినట్లుగా టీడీపీ ప్రభుత్వం హయాంలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై అప్పటి ప్రతిపక్ష పార్టీ ఇప్పటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా గట్టిగా పోరాటం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటాం అని కూడా ప్రకటించింది. 

ఈ కాల్ మనీ వ్యాపారుల ఆగడాల కారణంగా లేటెస్ట్‌గా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. కాల్ మనీ వ్యాపారుల ఆగడాలు భరించలేక తాడేపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు. ఉండవల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు కాల్ మనీ వ్యాపారుల కారణంగా కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నాడు. దీనిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేని బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

పోలీసుల పట్టించుకోకుండా కాలయపన చేసి తనను దుర్భషలాడారని ఆరోపిస్తూ.. తాడేపల్లి పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునేందు యత్నించాడు. వెంకటేష్‌కి 6లక్షలు వడ్డీకి ఇచ్చి 23 లక్షలు వడ్డీల రూపంలో కట్టించుకున్న వడ్డీ వ్యాపారి, తోలుత మూడు రూపాయల వడ్డీ అని కాల్ మనీ పేరుతో నెలకు12 రూపాయలు వసూళ్ళు చేశారని ఆరోపించారు.

డబ్బులు ఇవ్వకపోతే నీఅంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని సదరు బాధితుడు ఆరోపిస్తున్నాడు.  పోలీసులకు ఫిర్యాదు చేస్తే నీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరికలు చేస్తున్నారని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.