సెంటిమెంట్: ముహూర్తాలు చూస్తున్న అభ్యర్దులు

సెంటిమెంట్: ముహూర్తాలు చూస్తున్న అభ్యర్దులు

తొలివిడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం  సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 25 దాకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.

సెంటిమెంట్: ముహూర్తాలు చూస్తున్న అభ్యర్దులు

తొలివిడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం  సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 25 దాకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.

హైదరాబాద్: తొలివిడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం  సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 25 దాకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైనా ఒక మంచి పని చేసే ముందు ముహూర్తం చూసుకుని చేయటం సర్వ సాధారణంగా జరుగుతుంది. ఇక రాజకీయ నాయకులైతే చెప్పక్కర్లేదు. ఎన్నికల్లో నామినేషన్లు వేసే అభ్యర్ధులు  వారి వారి నమ్మకాలను అనుసరించి ముహుర్తాలు చూసుకుని నామినేషన్లు వేస్తారు. ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగటంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు వారి వారి నమ్మకాలను బట్టి  ముహూర్తాలు చూసుకుంటున్నారు.

కాగా ….. నామినేషన్లు ఉపసంహరణ గడువు మార్చి 28తో ముగుస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను 42 లోక్ సభ స్దానాలకు ఒకేసారి ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుంది. 21 న హోలీ పండుగ, 24న ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించరు. 2 సెలవు రోజులు పోనూ నామినేషన్లు వేసేందుకు 6 రోజులు మిగిలి ఉంటుంది.  ఈ 6 రోజుల్లో  మంచి ముహూర్తాల కోసం రాజకీయ నాయకులు జ్యోతిష్య పండితులను సంప్రదిస్తున్నారు.  
Read Also : నోటిఫికేషన్ వచ్చేసింది.. నామినేషన్ వేయవచ్చు

జ్యోతిష్యల లెక్కల ప్రకారం  మార్చి 19, 25 తేదీల్లో నామినేషన్లు వేస్తే కలిసొస్తుందని చెపుతున్నారు. మార్చి 19 మంగళవారం మఖ నక్షత్రం  త్రయోదశి తిధి ఉండటంతో  నామినేషన్ల దాఖలు చేస్తే కలిసొస్తుందని చెపుతున్నారు. ఒక వేళ 19వ తేదీ మంగళవారం సెంటిమెంట్ ఉంటే , అది ఇక్కడ వదిలేయవచ్చని, గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముహూర్త బలం బాగుండి మంగళవారం నామినేషన్ దాఖలుచేసి గెలుపొందిన దాదాపు 28 మందిని ఉదాహారణగా చూపిస్తున్నారు.  ఇక పోతే 25  సోమవారం  విశాఖ నక్షత్రం , పంచమి తిధి బాగుండటంతో  ఆ రోజు నామినేషన్లకు  మంచిదని  పండితులు  చెపుతున్నారు. 
Read Also : బీజేపీ ఫస్ట్‌లిస్ట్: 123 మంది అభ్యర్థులు వీళ్లే

×