50% vvpats లెక్కింపుపై మళ్లీ కోర్టుకెళతాం : చంద్రబాబు

దేశంలో  ఎన్నికల కమిషన్ అనేది ఉందా? ఉంటే అసలు పనిచేస్తోందా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

  • Published By: veegamteam ,Published On : April 15, 2019 / 09:01 AM IST
50% vvpats లెక్కింపుపై మళ్లీ కోర్టుకెళతాం : చంద్రబాబు

దేశంలో  ఎన్నికల కమిషన్ అనేది ఉందా? ఉంటే అసలు పనిచేస్తోందా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

అమరావతి : దేశంలో  ఎన్నికల కమిషన్ అనేది ఉందా? ఉంటే అసలు పనిచేస్తోందా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. 50 శాతం vv pat లను లెక్కించాల్సిన అవసరముందని చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనిపై మళ్లీ కోర్టుకు వెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 190కిపైగా దేశాల్లో కేవలం 18 దేశాలు మాత్రమే ఈవీఎంలు వాడుతున్నాయని తెలిపారు. ఓటు దేనికి వేశామో చెక్‌ చేసుకునే అవకాశం లేదని చంద్రబాబు మండిపడ్డారు. vv pat లో ఓటరు వేసిన గుర్తును 7 సెకన్లు చూపించాలనీ కానీ అవి కేవలం 3 సెకన్లు మాత్రమే చూపిస్తున్నాయని తెలిపారు.
Read Also : గెలుపుపై అనుమానాలు లేవు, 150కిపైగా సీట్లు ఖాయం : చంద్రబాబు ధీమా

ఎన్నికల్లో ఓటర్లను భయాందోళనలకు గురిచేస్తు..అరాచక శక్తులు విజృంభిస్తుంటే అసలు ఏమీ పట్లనట్లే వ్యవహరించారని చంద్రబాబు ఆరోపించారు. ఈసీ నిష్పక్షపాతంగా పనిచేయటం మానేసిందనీ..కొంతమంది ఎలా చెబితే అలా పనిచేస్తోందని ఆరోపించారు. ఈవీఎంలపై పలు అనుమానాలున్నాయనీ..వాటిని ఈసీ దృష్టికి తీసుకెళ్లినా..దానికి సంబంధించిన ఆధారాలు చూపినా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటేదన్నారు.23 రాజకీయ పార్టీలు కలిసి ఫ్రిబవరిలో ఈసీ వద్దకు వెళ్లి ఈవీఎంల ఎన్నికలపై అభ్యంతరం వ్యక్తం చేశామని గుర్తు చేశారు. vv pat  స్లిప్పులను లెక్కించాలని ఎన్నికలకు ముందే తాము డిమాండ్ చేశామని..దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లామని గుర్తు చేశారు. 

పనిచేయని ఈవీఎంలను ఎన్నికల్లో వినియోగించి ఓటర్ల సహనానికి ఈసీ పరీక్ష పెట్టిందన్నారు. కనీస ఏర్పాట్లు చేసి ఎన్నికలు సజావుగా నిర్వహించడం మాత్రం ఎన్నికల కమిషన్‌కు చేతకాలేదని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల రోజు మధ్యాహ్నానికి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని.. తాను వీడియో విడుదల చేసిన తర్వాత ఓటర్లు అనూహ్యంగా స్పందించి.. ఓటు వేసేందుకు పోటెత్తిన ఓటర్లను..ప్రజాస్వామ్రాన్ని ఎన్నికల కమిషన్ అపహాస్యం చేసిందన్నారు.ఇంత అస్థవ్యస్థ పాలనకు ఎవరు బాధ్యులని చంద్రబాబు ప్రశ్నించారు.

అభివృద్ది చెందిన దేశాలన్నీ ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ పేపర్ నే వినియోగిస్తున్నాయన్నారు. టెక్నాలజీని విస్తృతంగా వినియోగించే దేశాలు కూడా  20005లో ప్రారంభించి 2009లోనే వాటిని డీమానిట్ చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారిపోతోందనీ..కానీ పాత ఈవీఎంలను ఏమాత్రం అప్ డేట్ చేయకుండా ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ వ్యవహార తీరు దారుణమని చంద్రబాబు ఈసీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 
Read Also : టీడీపీ ప్రభుత్వమే పక్కా : మళ్లీ బాబే సీఎం – డొక్కా